Virat Kohli : ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌కు ముందు విరాట్ కోహ్లీకి ప్రత్యేక బహుమతి ఇచ్చిన సచిన్..
Virat Kohli-Sachin Tendulkar : క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. విరాట్ కోహ్లీకి టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రత్యేక బహుమతిని అందించాడు.

Sachin presents special gift to Kohli
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్ మ్యాచ్ లో తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించాలని 140 మంది కోట్ల భారతీయులు కోరుకుంటున్నారు. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు చాలా మంది ప్రముఖులతో పాటు పెద్ద సంఖ్యలో అభిమానులు స్టేడియానికి వచ్చారు. స్టేడియం మొత్తం నీలిసంద్రంగా మారింది.
ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌కు ముందు భారత పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీకి టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రత్యేక బహుమతిని అందించాడు. తాను సంతకం చేసిన తన జెర్సీని కోహ్లీకి సచిన్ అందించాడు. ప్రపంచకప్ గెలవాలని ఆకాంక్షించాడు. కోహ్లీకి శుభాకాంక్షలు తెలియజేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
World Cup Craze : క్రేజ్ ఆఫ్ వరల్డ్ కప్ ఫైనల్.. పరీక్షలు వాయిదా..
50 సెంచరీలు చేసిన ఒకే ఒక్కడు..
వన్డే క్రికెట్ చరిత్రలో 50 శతకాలు బాదిన ఒకే ఒక్కడ ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో సెంచరీ చేయడం ద్వారా విరాట్ ఈ ఘనతను అందుకున్నాడు. ఈ క్రమంలో సచిన్ 49 శతకాల రికార్డును బ్రేక్ చేశాడు. ఫైనల్ మ్యాచ్ కాకుండా కోహ్లీ ఈ మెగాటోర్నీలో ఇప్పటి వరకు 10 మ్యాచులు ఆడి 711 పరుగులు చేశాడు. ఇందులో మూడు శతకాలు, ఐదు అర్థశతకాలు ఉన్నాయి. అత్యధిక పరుగులు చేసిన జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
“You make us proud!”?
Sachin Tendulkar gifts Virat Kohli his signed jersey ahead of the #CWC23 Final ??#INDvAUS pic.twitter.com/Ej7KQu6T1a
— ICC Cricket World Cup (@cricketworldcup) November 19, 2023