Shubman Gill : ఇది గ‌మ‌నించారా..? అప్పుడు స‌చిన్‌.. ఇప్పుడు గిల్‌.. మామా అల్లుడు మీమ్స్‌తో హల్‌చల్

Shubman Gill - Sachin Tendulkar : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023 ఫైన‌ల్ మ్యాచ్‌లో భార‌త స్టార్ ఓపెన‌ర్ శుభ్‌మ‌న్ గిల్ 4 ప‌రుగులు చేసి ఆసీస్ పేస‌ర్ మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు.

Shubman Gill : ఇది గ‌మ‌నించారా..? అప్పుడు స‌చిన్‌.. ఇప్పుడు గిల్‌.. మామా అల్లుడు మీమ్స్‌తో హల్‌చల్

Shubman Gill - Sachin Tendulkar

Updated On : November 19, 2023 / 5:36 PM IST

అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023 ఫైన‌ల్ మ్యాచ్‌లో భార‌త స్టార్ ఓపెన‌ర్ శుభ్‌మ‌న్ గిల్ 7 బంతులు ఎదుర్కొని 4 ప‌రుగులు చేసి ఆసీస్ పేస‌ర్ మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఆడ‌మ్ జంపా క్యాచ్ అందుకోవ‌డంతో ఔట్ అయ్యాడు. ఫైన‌ల్ మ్యాచ్‌లో విఫ‌లం కావ‌డంతో సోష‌ల్ మీడియా వేదిక‌గా గిల్ పై ట్రోలింగ్ మొద‌లైంది. కాగా.. స‌చిన్ టెండూల్క‌ర్‌తో ముడిపెడుతూ మీమ్స్ క్రియేట్ చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

సచిన్ టెండూల్క‌ర్ కూతురు సారాతో గిల్‌ ప్రేమలో ఉన్నాడంటూ గ‌త కొంత‌కాలంగా వార్త‌లు వినిపిస్తున్నాయి. దీనిపై అటు గిల్ గానీ, ఇటు సారా స్పందించలేదు. దీంతో వీరిద్ద‌రు నిజంగానే ప్రేమ‌లో ఉన్నార‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలో.. గిల్ విఫ‌ల‌మైనా లేదా ప‌రుగులు సాధించినా కూడా స‌చిన్ టెండూల్క‌ర్‌తో ముడిపెడుతూ నెటీజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

World Cup final : ప్ర‌పంచ క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్‌లో క‌ల‌క‌లం.. కాసేపు ఆగిపోయిన మ్యాచ్‌.. ఏం జ‌రిగిందంటే..?

అప్పుడు స‌చిన్‌ కూడా..

ద‌క్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ వేదిక‌గా 2003లో భార‌త్‌, ఆస్ట్రేలియా జ‌ట్లు వ‌న్డే ప్ర‌పంచ‌క క‌ప్ ఫైన‌ల్ మ్యాచులో త‌ల‌ప‌డ్డాయి. ఆ మ్యాచ్‌లో 5 బంతులు ఆడిన స‌చిన్ 4 ప‌రుగులు చేసి ఔట్ అయ్యాడు. ఇప్పుడు గిల్ కూడా స‌రిగ్గా 4 ప‌రుగులే చేసి ఔట్ అయ్యాడు ఈ రెండు సంద‌ర్భాల్లో ప్ర‌త్య‌ర్థి ఆస్ట్రేలియా కాగా.. రెండు మ్యాచులు కూడా వ‌న్డే ప్రపంచ‌క‌ప్ ఫైన‌ల్ మ్యాచులు కావ‌డం గ‌మ‌నార్హం. ఇప్పుడు ఇదే విష‌యమై సోష‌ల్ మీడియా వేదిక‌పై స‌చిన్, గిల్ ల‌పై మీమ్స్ వైర‌ల్ అవుతున్నాయి.

Rohit Sharma : రోహిత్ శ‌ర్మ అరుదైన ఘ‌న‌త‌.. ప్ర‌పంచ‌ కెప్టెన్ల‌లో ఒకే ఒక్క‌డు