Virat Kohli : ఎట్ట‌కేల‌కు అమెరికా విమానం ఎక్కిన కోహ్లి.. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ఆడ‌తాడా?

క్రికెట్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న టీ20 ప్ర‌పంచ‌క‌ప్ స‌మ‌రానికి స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డింది.

Virat Kohli : ఎట్ట‌కేల‌కు అమెరికా విమానం ఎక్కిన కోహ్లి.. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ఆడ‌తాడా?

Virat Kohli leaves for the USA gives autograph to fan at Mumbai Airport

Updated On : May 31, 2024 / 1:33 PM IST

Virat Kohli – T20 World Cup 2024 : క్రికెట్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న టీ20 ప్ర‌పంచ‌క‌ప్ స‌మ‌రానికి స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డింది. భార‌త కాల‌మానం ప్ర‌కారం జూన్ 2 నుంచి ఈ పొట్టి ప్ర‌పంచ‌క‌ప్ ఆరంభం కానుంది. అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లో పాల్గొనేందుకు రెండు బృందాలుగా భార‌త జ‌ట్టు ఇప్ప‌టికే అమెరికాకు చేరుకుంది. అయితే.. టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లి మాత్రం వెళ్ల‌లేదు.

కాగా.. ఎట్ట‌కేల‌కు ప‌రుగుల యంత్రం, రికార్డుల రారాజు కోహ్లి అమెరికా బ‌య‌లుదేరారు. గుర‌వారం రాత్రి ముంబై విమానాశ్ర‌యానికి చేరుకున్న అతడు అమెరికా ఫ్లైట్ ఎక్కాడు. ముంబై ఎయిర్‌పోర్టులో కోహ్లిని చూసిన అభిమానులు అత‌డితో ఫోటోలు దిగారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో లు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

Rohit sharma : ఓ వైపు వ‌ర్షం.. మ‌రోవైపు ఫోటో కావాల‌ని అడిగిన అభిమాని.. రోహిత్, ద్ర‌విడ్‌ ప‌రుగో ప‌రుగు..!

ఇదిలా ఉంటే.. భార‌త జ‌ట్టు జూన్ 1 బంగ్లాదేశ్‌తో వార్మ‌ప్ మ్యాచ్ ఆడ‌నుంది. ఈ మ్యాచ్‌లో కోహ్లి ఆడ‌తాడా లేదా అనే దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త జ‌ట్టు త‌న తొలి మ్యాచ్‌ను జూన్ 5న ఐర్లాండ్‌తో ఆడ‌నుంది. ఇక క్రికెట్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూసే భార‌త్, పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జూన్ 9న న్యూయార్క్ వేదిక‌గా జ‌ర‌గ‌నుంది.

టీ20 ప్రపంచకప్‌ కోసం టీమ్ఇండియా ఇదే..
రోహిత్ శర్మ (కెప్టెన్‌), విరాట్‌ కోహ్లీ, యశస్వి జైశ్వాల్‌, సూర్యకుమార్ యాదవ్, రిషభ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), సంజూ శాంసన్‌ (వికెట్‌ కీపర్‌), హార్దిక్‌ పాండ్యా (వైస్‌ కెప్టెన్‌), శివమ్‌ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, యుజ్వేంద్ర చాహల్‌, అర్షదీప్‌ సింగ్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహమ్మద్‌ సిరాజ్‌.

Rohit Sharma : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు ముందు.. రోహిత్ శ‌ర్మ‌ను ఊరిస్తున్న అరుదైన రికార్డు..