BCCI : సౌతాఫ్రికా ఫ్లైట్ ఎక్కిన టీమిండియా క్రీడాకారులు
మూడుసార్లు కరోనా పరీక్షలు నిర్వహించిన అనంతరం మ్యాచ్ ఆడేందుకు అనుమతినివ్వనున్నారు అక్కడి అధికారులు. నెగటివ్ ఫలితం వస్తే..

Bcci
South Africa And Team India : సౌతాఫ్రికా ఫ్లైట్ ఎక్కారు టీమిండియా క్రీడాకారులు. కోహ్లీ నేతృత్వంలో జట్టు బయలుదేరింది. ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండడంతో బీసీసీఐ కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకుంది. ప్రత్యేక చార్టర్ ఫ్లైట్ లో ఆటగాళ్లను అక్కడకు పంపింది. దీనికి సంబంధించిన ఫొటోలను ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. జొహన్నస్ బర్గ్ చేరుకోగానే..ఒకరోజు మాత్రమే ఐసోలేషన్ లో గడపనున్నారు.
Read More : Hyderabad Crime : గచ్చిబౌలి దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు
మూడుసార్లు కరోనా పరీక్షలు నిర్వహించిన అనంతరం మ్యాచ్ ఆడేందుకు అనుమతినివ్వనున్నారు అక్కడి అధికారులు. నెగటివ్ ఫలితం వస్తే..బయో సెక్యూర్ ఎన్విరాన్ మెంట్ లోకి పంపనున్నారు. కుటుంబసభ్యులందరికీ అనుమతినవ్వలేదు. కానీ..కోహ్లీ మాత్రం ప్రత్యేక అనుమతి తీసుకుని…సతీమణి అనుష్క శర్మ, కూతురిని వెంట తీసుకెళ్లారని తెలుస్తోంది.
Read More : Sheena Bora : షీనా బోరా బతికే ఉంది..తల్లి ఇంద్రాణి ముఖర్జియా సంచలన లేఖ
ఇక మ్యాచ్ విషయానికి వస్తే…మూడు టెస్ట్‌ల సిరీస్ జరుగనుంది. భారత పర్యటనలో భాగంగా సెంచూరియన్ వేదికగా డిసెంబర్ 26 నుంచి డిసెంబర్ 30 వరకు తొలి టెస్ట్ జరుగనుంది. జొహన్నెస్‌బర్గ్ వేదికగా వచ్చే ఏడాది 2022 జనవరి 3 నుంచి 7 వరకు రెండో టెస్ట్ జరుగనుంది. కేప్‌టౌన్ వేదికగా జనవరి 11 నుంచి జనవరి 15 వరకు మూడో టెస్ట్ జరుగనుంది. ఆ తర్వాత జట్లు మూడు వన్డేలు ఆడనున్నాయి
All buckled up ✌?
South Africa bound ✈️??#TeamIndia #SAvIND pic.twitter.com/fCzyLzIW0s
— BCCI (@BCCI) December 16, 2021