Virat Kohli: మళ్లీ ఆర్‌సీబీ కెప్టెన్ గా విరాట్ కోహ్లి.. ఎందుకంటే!

డుప్లెసిస్ టీమ్ లో ఉండగా కోహ్లికి సారథ్య బాధ్యతలు అప్పజెప్పడం ఏంటని అనుకుంటున్నారు?

Virat Kohli: మళ్లీ ఆర్‌సీబీ కెప్టెన్ గా విరాట్ కోహ్లి.. ఎందుకంటే!

Photo: @RCBTweets

Updated On : April 20, 2023 / 5:15 PM IST

Virat Kohli: విరాట్ కోహ్లి మరోసారి ఆర్‌సీబీ పగ్గాలు చేపట్టాడు. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌ లో మొహాలీ వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌ తో జరుగుతున్న మ్యాచ్ లో ఆర్ సీబీ జట్టుకు కోహ్లి కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే రెగ్యులర్ కెప్టెన్ డుప్లెసిస్ కూడా మ్యాచ్ ఆడడం విశేషం. డుప్లెసిస్ టీమ్ లో ఉండగా కోహ్లికి సారథ్య బాధ్యతలు అప్పజెప్పడం ఏంటని అనుకుంటున్నారా?

ఈ రోజు మ్యాచ్ లో టాస్ రెండు జట్ల స్టాండ్ బై కెప్టెన్లు వచ్చారు. ఆర్‌సీబీ తరపున విరాట్ కోహ్లి, పంజాబ్ టీమ్ కెప్టెన్ గా సామ్ కరన్ వచ్చారు. సామ్ కరన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఆర్‌సీబీ టీమ్ ముందుగా బ్యాటింగ్ కు దిగింది. విరాట్ కోహ్లి, డుప్లెసిస్ ఓపెనర్లుగా వచ్చారు. ఇక అసలు విషయం ఏమిటంటే డుప్లెసిస్ ఈరోజు ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌ (Impact Player)గా బ్యాటింగ్ చేశాడు. డుప్లెసిస్(84), రాట్ కోహ్లి(59) అర్ధ సెంచరీలతో అదరగొట్టారు.

పక్కటెముక గాయంతో బాధ పడుతున్న ఫాఫ్ డు ప్లెసిస్ (Faf du Plessis ) ఫీల్డింగ్ చేసే పరిస్థితిలో లేడు కాబట్టి అతడు ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా ఆడుతున్నాడని టాస్ సమయంలో కెప్టెన్ కోహ్లి చెప్పాడు. తమ జట్టులో ఇదొక్కటే మార్పు అని వెల్లడించాడు. డుప్లెసిస్ కు సబ్ స్టిట్యూట్ గా విజయ్‌కుమార్ వైశాక్ వ్యవహరిస్తున్నాడు.

Also Read: ఐపీఎల్‌లో ఫిక్సింగ్ కలకలం.. మహ్మద్ సిరాజ్ బీసీసీఐకు తెలియజేయడంతో వెలుగులోకి వ్యవహారం

పంజాబ్ కింగ్స్‌ రెగ్యులర్ కెప్టెన్ శిఖర్ ధవన్ గాయం కారణంగా ఈరోజు మ్యాచ్ కు దూరయ్యాడు. అతడి స్థానంలో సామ్ కరన్ (Sam Curran) సారథ్య బాధత్యలు చేపట్టాడు. లియామ్ లివింగ్‌స్టోన్, నాథన్ ఎల్లిస్ జట్టులోకి వచ్చారు.

Also Read: ఇదేందీ మామ.. గెలిచామ‌న్న ఆనందం లేకుండా చేశారు