బ్యాటింగ్ దిగ్గజాలు సచిన్, కోహ్లిలో ఎవరికి బౌలింగ్‌ చేయడం కష్టం? జేమ్స్‌ అండర్సన్‌ తేల్చి చెప్పాడుగా..

పర్యటన వేళ విరాట్ కోహ్లి ఇబ్బంది పడ్డాడని తెలిపాడు.

బ్యాటింగ్ దిగ్గజాలు సచిన్, కోహ్లిలో ఎవరికి బౌలింగ్‌ చేయడం కష్టం? జేమ్స్‌ అండర్సన్‌ తేల్చి చెప్పాడుగా..

Updated On : June 17, 2025 / 7:34 AM IST

భారత మాజీ బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, స్టార్ బ్యాటర్ విరాట్‌ కోహ్లి క్రికెట్‌లో ఎంతగా పేరు తెచ్చుకున్నారో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. ఎన్నో రికార్డులు వారి పేరిట ఉన్నాయి. వారిద్దరికి బౌలింగ్ చేసిన అనుభవం ఇంగ్లాండ్‌ మాజీ పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌కు ఉంది. వారిద్దరిలో ఎవరికి బౌలింగ్‌ చేయడం కష్టమో అతడు చెప్పాడు.

సచిన్‌ టెండూల్కర్‌ కన్నా విరాట్‌ కోహ్లికి బౌలింగ్‌ చేయడం కష్టమని జేమ్స్‌ అండర్సన్ తెలిపాడు. 2014లో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకున్నాడు. ఆ ఏడాది మొదటి ఇంగ్లాండ్‌ పర్యటన వేళ విరాట్ కోహ్లి ఇబ్బంది పడ్డాడని తెలిపాడు.

Also Read: కేటీఆర్ వ్యక్తి కాదు శక్తి.. టచ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ భస్మం అవుతుంది- హరీశ్ రావు

ఆఫ్‌స్టంప్‌ మీదుగా పడే బాల్స్‌ విషయంలో కోహ్లి పడ్డ ఇబ్బందులను వాడుకుని అతడిపై ఆధిపత్యం చలాయించానని జేమ్స్‌ అండర్సన్‌ అన్నాడు. అయితే, నాలుగేళ్ల అనంతరం ఇంగ్లాండ్‌లో పర్యటించిన వేళ కోహ్లి ఆ ఇబ్బందులను అధిగమించి ఆడాడని చెప్పాడు.

ఆ సమయంలో భిన్నమైన ప్లేయర్‌గా కనిపించాడని జేమ్స్‌ అండర్సన్‌ తెలిపాడు. తనపైనే కాకుండా తమ జట్టులోని బౌలర్లందరిపైనా పై చేయి సాధించాడని అన్నాడు. అతడితో పోల్చి చూస్తూ సచిన్‌ టెండూల్కర్‌ భిన్నమైన ప్లేయర్‌ అని తెలిపాడు. సచిన్‌ ప్రశాంతంగా కనపడతాడని, కోహ్లీ మాత్రం దూకుడుగా ఉంటాడని చెప్పాడు.