Virat Kohli earbuds
Virat Kohli earbuds : టీమ్ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి(Virat Kohli)కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దేశంలోనే కాదు విదేశాల్లోనూ చాలా మంది అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం ఈ పరుగుల యంత్రం వెస్టిండీస్ పర్యటనలో ఉన్నాడు. ఇటీవల అతడిని కలిసేందుకు వెస్టిండీస్ వికెట్ కీపర్ ‘జాషువా డా సిల్వా’ తల్లి వచ్చింది. విరాట్ ను చూసిన ఆమె ఎంతో సంతోషించింది. కోహ్లి కూడా ఆమెతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా.. ఈ వీడియోలో విరాట్ కోహ్లి ఖరీదైన ఎయిర్ బడ్స్ పెట్టుకుని కనిపించాడు. అది ఏ కంపెనీకి చెందిన ఇయర్ బడ్స్..? ధర ఏంత..? వంటి వివరాలను తెలుసుకునే విరాట్ అభిమానులు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. అయితే.. విరాట్ పెట్టుకున్న ఇయర్ బడ్స్ ఇండియాలో మాత్రం అందుబాటులో లేవు.
INDvs WI 3rd ODI : టీమ్ఇండియా అతి ప్రయోగాలా..? వరుణుడి ఆటనా..?
సెలబ్రెటీలు, క్రికెటర్లు ఎక్కువగా యాపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో, యాపిల్ ఎయిర్‌పాడ్స్ మ్యాక్స్ వంటి మోడల్స్‌ను వాడడాన్ని చూస్తుంటాం. అయితే విరాట్ మాత్రం బీట్స్ పవర్‌బీట్స్ ప్రో టీడబ్ల్యూఎస్ ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని కనిపించాడు. ఇవి ఇండియాలో అందుబాటులో లేవని తెలుస్తోంది. దీని ధర రూ. 249.95 డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 20,000 వరకు). ఇవి యూఎస్ మార్కెట్‌లోని ఆపిల్ స్టోర్‌లలో లేదా అమెజాన్ వంటి ఆన్‌లైన్ సెక్టార్లలో మాత్రమే లభిస్తాయి.
బీట్స్ పవర్ బీట్స్ ప్రో మోడల్‌లో అడ్జెస్టెబుల్ ఇయర్ హుక్స్ ఉంటాయి. దీంతో ఎక్కువ కంఫర్ట్ లభిస్తుంది. పవర్‌బీట్స్ ప్రో మొదటి సారి 2018లో ప్రారంభమైంది. దీని లేటెస్ట్ వెర్షన్ నవంబర్ 2022లో విడుదలైంది.
????????? ? ❤️
When Virat Kohli made Josh’s mom’s day & “year” ?#TeamIndia | #WIvIND | @imVkohli | @windiescricket | @joshuadasilva08 pic.twitter.com/0RL20rRcYL
— BCCI (@BCCI) July 22, 2023