Moeen Ali : యాషెస్ కోస‌మేనా.. మ‌ళ్లీ రిటైర్మెంట్ ప్ర‌కటించిన స్టార్ ఆల్‌రౌండ‌ర్‌.. ఈ సారి మెసేజ్ చేస్తే డిలీట్ చేస్తా..

క్రికెట్ అభిమానులంద‌రిని ఉర్రూత‌లూగిస్తూ హోరాహోరీగా సాగిన యాషెస్ (Ashes ) సిరీస్ ముగిసింది. సిరీస్ చివ‌రి రోజు ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా జ‌ట్లు విజ‌యం కోసం నువ్వా నేనా అన్న‌ట్లు పోరాడాయి.

Moeen Ali : యాషెస్ కోస‌మేనా.. మ‌ళ్లీ రిటైర్మెంట్ ప్ర‌కటించిన స్టార్ ఆల్‌రౌండ‌ర్‌.. ఈ సారి మెసేజ్ చేస్తే డిలీట్ చేస్తా..

Moeen Ali

Moeen Ali Retirement : క్రికెట్ అభిమానులంద‌రిని ఉర్రూత‌లూగిస్తూ హోరాహోరీగా సాగిన యాషెస్ (Ashes ) సిరీస్ ముగిసింది. సిరీస్ చివ‌రి రోజు ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా జ‌ట్లు విజ‌యం కోసం నువ్వా నేనా అన్న‌ట్లు పోరాడాయి. అయితే.. చివ‌రికి ఇంగ్లాండ్ జ‌ట్టు 49 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించి ఐదు టెస్టు మ్యాచ్‌ల యాషెస్ సిరీస్‌ను 2-2తో స‌మం చేసింది. అయితే.. గ‌త యాషెస్ సిరీస్ ఆస్ట్రేలియా గెల‌వ‌డంతో ట్రోఫీ ఆ జ‌ట్టుతోనే కొన‌సాగ‌నుంది. ఇక ఈ మ్యాచ్ ముగిసిన అనంత‌రం ఇంగ్లాండ్ ఆల్‌రౌండ‌ర్ మొయిన్ అలీ (Moeen Ali) టెస్టు క్రికెట్‌కు మ‌రోసారి రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు.

యాషెస్ కోస‌మే..

వాస్త‌వానికి మొయిన్ అలీ 2021 సెప్టెంబ‌ర్ లో టెస్టుల‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించాడు. కేవ‌లం ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్ మాత్ర‌మే ఆడుతున్నాడు. అయితే.. యాషెస్ సిరీస్ 2023కి ముందు ఇంగ్లాండ్ స్పిన్న‌ర్ జాక్‌లీచ్ గాయ‌ప‌డ్డాడు. అత‌డి గాయం తీవ్ర‌త అధికంగా ఉండ‌డంతో యాషెస్ సిరీస్ మొత్తానికి దూరం అయ్యాడు. దీంతో ఇంగ్లాండ్‌కు నాణ్య‌మైన స్పిన్న‌ర్ అవ‌స‌రం ఏర్ప‌డింది. వెంట‌నే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు, టెస్టు జ‌ట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్‌, కోచ్ మెక్‌క‌ల్ల‌మ్‌లు మొయిన్ అలీని క‌లిసి త‌న రిటైర్మెంట్ ను వెన‌క్కి తీసుకోవాల‌ని కోరారు.

Ravindra Jadeja: కపిల్ దేవ్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన టీమిండియా క్రికెటర్ జడేజా..

మొద‌ట మొయిన్ అలీ ఇందుకు నో చెప్పినా స్టోక్స్ అత‌డికి న‌చ్చ‌జెప్ప‌డంతో ఒప్పుకున్నాడు. సెల‌క్ట‌ర్లు యాషెస్ సిరీస్‌కు ఎంపిక చేశారు. యాషెస్ సిరీస్‌లో రీ ఎంట్రీ ఇచ్చిన మొయిన్ మంచి ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. మొత్తం నాలుగు మ్యాచులు ఆడి 180 ప‌రుగులు చేయ‌డంతో పాటు 9 వికెట్లు ప‌డ‌గొట్టాడు. చేతి గాయంతో బాధ‌ప‌డుతున్న‌ప్ప‌టికీ మ్యాచులు ఆడాడు.

సిరీస్ ముగిసింది.. మ‌ళ్లీ రిటైర్మెంట్‌

యాషెస్ సిరీస్ ముగిసిన అనంత‌రం మొయిన్ అలీ మాట్లాడుతూ.. టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టిస్తున్న‌ట్లు తెలిపాడు. ఒక‌వేళ బెన్‌స్టోక్స్ క‌నుక త‌న‌కు మ‌ళ్లీ మెసేజ్ చేస్తే వెంట‌నే డిలీట్ చేస్తాన‌ని చెప్పాడు. సిరీస్‌ను చాలా బాగా ఎంజాయ్ చేశాన‌ని చెప్పుకొచ్చాడు. ఇక ఆఖ‌రి మ్యాచ్‌ను విజ‌యంతో ముగించ‌డం ఎంతో సంతోషాన్ని ఇచ్చింద‌న్నాడు.

‘రీ ఎంట్రీ ఇవ్వ‌మ‌ని స్టోక్స్ మొద‌ట అడిగిన‌ప్పుడు నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే నాకు ఆస్ట్రేలియాపై గొప్ప రికార్డు లేదు. అయితే.. స్టోక్స్ న‌న్ను న‌మ్ముతున్నాన‌ని చెప్పాడు. నువ్వు రాణించ‌గ‌ల‌వు అని చెప్పాడు. దీంతో సుదీర్ఘ ఫార్మాట్ ఆడేందుకు అంగీక‌రించాను. మ‌ళ్లీ జేమ్స్ అండ‌ర్స‌న్‌, స్టువ‌ర్ట్ బ్రాడ్‌తో క‌లిసి డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకోవ‌డం ఎంతో ఆనందాన్నిఇచ్చింది.’ అని మొయిన్ అలీ అన్నాడు.

WI Vs IND T20 Series: సిక్సర్ల వీరుడు వచ్చేశాడు..! ఇండియాతో ఐదు టీ20 మ్యాచ్‌లకు జట్టును ప్రకటించిన వెస్టిండీస్..

మొయిన్ అలీ ఇంగ్లాండ్ త‌రుపున 68 టెస్టు మ్యాచ్‌లు ఆడి 3094 పరుగులు చేసి 204 వికెట్లు తీశాడు. టెస్టుల‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్‌లో మాత్రం కొన‌సాగ‌నున్నాడు.