Ravindra Jadeja: కపిల్ దేవ్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన టీమిండియా క్రికెటర్ జడేజా..

టీమిండియా దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ వ్యాఖ్యలకు టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా స్పందిస్తూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Ravindra Jadeja: కపిల్ దేవ్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన టీమిండియా క్రికెటర్ జడేజా..

Ravindra Jadeja and Kapil Dev

Team India: టీమిండియా సీనియర్ ఆటగాళ్లపై దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. టీమిండియా సీనియర్ ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఒకలా, జాతీయ జట్టుకు వచ్చేసరికి ఒకలా ప్రవర్తిస్తున్నారని, వీరికి జాతీయ జట్టుకంటే ఐపీఎల్‌నే ముఖ్యమా అంటూ కపిల్ దేవ్ ప్రశ్నించారు. ప్రస్తుత క్రికెటర్లు అన్నీ మాకే తెలుసని అనుకుంటారని, ఎవరి సలహా అడగాలని అనుకోరని ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కపిల్ వ్యాఖ్యానించారు. కపిల్ వ్యాఖ్యలకు టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా స్పందిస్తూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రతీ ఆటగాడు ప్రతి మ్యాచ్ ఆడాలని అనుకుంటాడని, అయితే, జట్టు అవసరాలను బట్టి కొత్త ప్లేయర్లను తీసుకోవాలని అనుకుంటే దానిని అమలు చేయడానికి సిద్ధంగా ఉంటామని అన్నారు.

Kapil Dev: ఐపీఎల్‌లో అలా.. జాతీయ జట్టులో ఇలా..! టీమిండియా సీనియర్లపై కపిల్ దేవ్ మరోసారి విమర్శలు

ఆసియా కప్, వన్డే ప్రపంచ కప్ వంటి మెగా టోర్నీలకు ముందు భారత్ జట్టు ఆడే చివరి వన్డే సిరీస్ ఇదే. దీనిని ప్రయోగాలకు వేదికగా చేసుకోవాల్సి వచ్చింది. విండీస్‌తో రెండో వన్డేకు కొత్త ప్లేయర్స్ అవకాశం ఇచ్చి పలు విభాగాల్లో మార్పులు చేయడం జరిగింది. ఆ మ్యాచ్ ఓడిపోయినప్పటికీ పెద్దగా వచ్చే నష్టం ఏమీలేదు. ఇలా చేయడం వల్ల మెగా టోర్నీల్లో ఎలాంటి కాంబినేషన్‌తో వెళ్లాలనే దానిపై అవగాహన వస్తుంది. ఈ విషయంలో ఏం చేయాలనేది మేనేజ్ మెంట్, కెప్టెన్ కు తెలుసు అని జడేజా అన్నారు.

India Tour of Ireland : ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌.. బుమ్రా వ‌చ్చేశాడు.. కెప్టెన్సీ కూడా అత‌డికే

టీమిండియాలోని సీనియర్ ఆటగాళ్లలో గర్వం ఉందని కపిల్ వ్యాఖ్యలకు జడేజా స్పందించారు. భారత జట్టు ఓడిపోయినప్పుడు నిత్యం ఇలాంటి విమర్శలు రావడం పరిపాటిగా మారింది. ఇక్కడ ఎవరూ కూడా పొగరుగా ఉండరు. గర్వం అనేది ఎవరికి ఉండదు, వచ్చే అవకాశాలను బట్టి తమ ప్రతిభను నిరూపించుకోవాలని ప్రతి క్రికెటర్ కోరుకుంటారు అని జడేజా అన్నారు. ఇదిలాఉంటే మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఈ రోజు (మంగళవారం) రాత్రి మూడో వన్డే జరుగుతుంది. ప్రస్తుతం రెండు వన్డేల్లో ఇండియా, విండీస్ జట్లు చెరో మ్యాచ్ గెలిచి సిరీస్ ను సమం చేశాయి. మూడో వన్డే నిర్ణయాత్మక మ్యాచ్ మంగళవారం జరుగుతుంది.