PIC Credit @
మెల్‌బోర్న్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. ఈ బాక్సింగ్‌డే టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తోంది. ఈ మ్యాచ్ ద్వారా 19 ఏళ్ల యువ ఆటగాడు సామ్ కాన్‌స్టాస్ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగ్రేటం చేశాడు. తన తొలి మ్యాచ్‌లోనే అదరిపోయే ఆటతీరును ప్రదర్శించాడు. టీమ్ఇండియా స్టార్ పేసర్లు జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ లకు చుక్కలు చూపించాడు. టీ20 తరహా షాట్లతో బౌండరీలు కొడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
మొత్తంగా తొలి ఇన్నింగ్స్‌లో సామ్ 65 బంతులు ఎదుర్కొన్నాడు. 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 60 పరుగులు చేసి స్పిన్నర్ రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో ఆస్ట్రేలియా 89 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఇక తొలి రోజు లంచ్ విరామ సమయానికి ఆసీస్ వికెట్ నష్టానికి 112 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖావాజా (38), మార్నస్ లబుషేన్ (12) లు క్రీజులో ఉన్నారు.
Cricket Viral Videos : అరుదైన ఘటన.. స్టేడియం పైకప్పును తాకిన బంతి.. బౌలర్ చేతికి గాయం..
సిరాజ్, కోహ్లీతో వాగ్వాదం..
సిరాజ్ బౌలింగ్‌లో సామ్ కాన్‌స్టాస్ ఫ్రంట్ ఫుట్ వచ్చి ఆడాడు. అయితే.. బంతిని కనెక్ట్ చేయడంలో విఫలం అయ్యాడు. ఈ క్రమంలో సిరాజ్ ఏదో అన్నాడు. ఆ తరువాత సైతం సామ్ ఆదే విధంగా ఆడాడు. ఈ సారి బాల్‌ను కొట్టినప్పటికి పరుగులు చేయడంలో విఫలం అయ్యాడు. ఈ క్రమంలో మరోసారి సిరాజ్ అతడిని ఏదో అన్నాడు. ఆ తరువాతి బంతికి సామ్ ఫోర్ కొట్టి బ్యాట్‌తోనే గట్టి సమాధానం ఇచ్చాడు.
ఈ ఓవర్ తరువాత సామ్ కాన్‌స్టాస్ నడిచి వస్తుండగా విరాట్ కోహ్లీ భుజం తగిలింది. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాతో పాటు అంపైర్లు వచ్చి సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూస్తుంటే కోహ్లీ కావాలనే యువ ఆటగాడి భుజాన్ని తాకాడని అనిపిస్తోంది. యువ ఆటగాడి ఏకాగ్రతను చెడగొట్టేందుకే కోహ్లీ ఈ విధంగా చేసి ఉంటాడని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Senior Womens Trophy 2024 : చరిత్ర సృష్టించిన బెంగాల్ జట్టు..
Kohli and Konstas come together and make contact 👀#AUSvIND pic.twitter.com/adb09clEqd
— 7Cricket (@7Cricket) December 26, 2024