Senior Womens Trophy 2024 : చరిత్ర సృష్టించిన బెంగాల్ జ‌ట్టు..

మ‌హిళ‌ల వ‌న్డే క్రికెట్‌లో బెంగాల్ జ‌ట్టు అరుదైన ఘ‌న‌త సాధించింది.

Senior Womens Trophy 2024 : చరిత్ర సృష్టించిన బెంగాల్ జ‌ట్టు..

Bengal Team Scripts History With World Record Chase In 50 Over Cricket

Updated On : December 24, 2024 / 10:35 AM IST

మ‌హిళ‌ల వ‌న్డే క్రికెట్‌లో బెంగాల్ జ‌ట్టు అరుదైన ఘ‌న‌త సాధించింది. వ‌న్డేల్లో అత్య‌ధిక ల‌క్ష్యాన్ని ఛేదించిన జ‌ట్టుగా బెంగాల్ చ‌రిత్ర సృష్టించింది. సోమ‌వారం రాజ్‌కోట్‌లోని నిరంజ‌న్ షా స్టేడియం గ్రౌండ్ సిలో హ‌ర్యానాతో జ‌రిగిన మ్యాచ్‌లో ఈ ఘ‌న‌త‌ను సాధించింది.

సీనియ‌ర్ మ‌హిళ‌ల ట్రోఫీ 2024లో భాగంగా హ‌ర్యానా, బెంగాల్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో హ‌ర్యానా జ‌ట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 389 ప‌రుగులు సాధించింది. హ‌ర్యానా బ్యాట‌ర్ల‌లో ష‌ఫాలీ వ‌ర్మ తృటిలో డ‌బుల్ సెంచ‌రీని కోల్పోయింది. 115 బంతులు ఎదుర్కొన్న ష‌ఫాలీ 22 ఫోర్లు, 11 సిక్స‌ర్ల‌తో 197 ప‌రుగులు సాధించింది. ఈ టోర్న‌మెంట్‌లో ఆమెకు ఇది రెండో సెంచ‌రీ.

IND vs AUS : నాలుగో టెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు బ్యాడ్‌న్యూస్‌..! ఆనందంలో భార‌త ఆటగాళ్లు..!

భారీ ల‌క్ష్యాన్ని బెంగాల్ జ‌ట్టు మ‌రో ఐదు బంతులు మిగిలి ఉండ‌గానే అందుకుంది. బెంగాల్ బ్యాట‌ర్ల‌లో త‌నుశ్రీ సర్కార్ (113; 83 బంతుల్లో 20 ఫోర్లు) శ‌త‌కంతో చెల‌రేగింది. ప్రియాంక బాలా (88 నాటౌట్‌), ధారా గుజ్జర్ (69) హాఫ్ సెంచ‌రీల‌తో రాణించారు.

లిస్ట్-ఎ మహిళల క్రికెట్‌లో ఇదే అత్య‌ధిక ల‌క్ష్య ఛేద‌న‌. గ‌తంలో ఈ రికార్డు నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ పేరిట ఉంది. 2019 న్యూజిలాండ్ దేశవాళీ మ్యాచ్‌లో కాంటర్‌బరీపై 309 ల‌క్ష్యాన్ని నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ ఛేదించింది. అంతర్జాతీయ మ్యాచుల విష‌యానికి వ‌స్తే.. ద‌క్షిణాఫ్రికా పై శ్రీలంక 305 పరుగుల ల‌క్ష్యాన్ని ఛేదించింది.

Mohammed Shami – Sania Mirza : మ‌హ్మ‌ద్ ష‌మీ, సానియా మీర్జాలు పెళ్లి చేసుకున్నారా? ఫోటోలు వైర‌ల్‌.. అస‌లు నిజం ఇదే..