Virat Kohli: విరాట్ ఈజ్ గ్రేట్.. క్వారంటైన్లోనూ అలాంటి డైట్..
ఇండియన్ టీమ్ క్రికెటర్లలో ఫిట్నెస్ గల ప్లేయర్లలో విరాట్ కోహ్లీ టాప్. టీమిండియాకే కాదు.. యువతలోనూ ఫిట్నెస్ ను ప్రోత్సహించే విధంగా మారారు కోహ్లీ. కరెక్ట్ డైట్ తో.. హెల్తీగా, ఫిట్ గా ఉండటానికి మోటివేషన్ గానూ మారాడు.
Virat Kohli: ఇండియన్ టీమ్ క్రికెటర్లలో ఫిట్నెస్ గల ప్లేయర్లలో విరాట్ కోహ్లీ టాప్. టీమిండియాకే కాదు.. యువతలోనూ ఫిట్నెస్ ను ప్రోత్సహించే విధంగా మారారు కోహ్లీ. కరెక్ట్ డైట్ తో.. హెల్తీగా, ఫిట్ గా ఉండటానికి మోటివేషన్ గానూ మారాడు. ప్రత్యేకించి జిమ్ లు, యోగా సెంటర్లు లేని క్వారంటైన్ లైంటో కూడా అదే డైట్ ఫాలో అయ్యారు.
అదేముందిలే రొటీన్ గా ఫాలో అయ్యేదే కదా.. అనుకోవడానికి లేదు. మ్యాచ్ లు లేకుండా ఇంట్లోనే ఉంటున్న సమయంలోనూ అతను ఫాలో అయిన డైట్ గురించి తెలుసా… ఇటీవల సోషల్ మీడియాలో ఏదైనా అడగొచ్చు అంటూ కోహ్లీ అభిమానులతో ఓ సెషన్ నిర్వహించాడు. అందులో ప్రశ్నకు ఇలా బదులిచ్చాడు.
చాలా కూరగాయలు, కొన్ని గుడ్లు, రెండు కప్పుల కాఫీ, క్వినోవా, బచ్చలకూర, దోసెలు కూడా. కాకపోతే అన్ని కొద్ది మొత్తంలోనే అని రిప్లై ఇచ్చాడు.
ఎక్కువ శాతం తాను ఇండియన్ స్టైల్ లో వండిన ఆహారాన్నే తీసుకుంటానని చెపపాడు. పండ్లు, పప్పు ధాన్యాలు కలిసిన ఫుడ్ కచ్చితంగా తీసుకునేవాడట. కొన్ని సార్లు చైనీస్ ఫుడ్, బాదం పప్పు, ప్రొటీన్ బార్, ఫ్రూట్స్ ఉండేవట.