‘పాకిస్తానీ అనే ఐసీసీ బౌలింగ్ చేయకుండా నిషేధించింది’

క్రికెట్ అనేది జెంటిల్‌మాన్ గేమ్.. అదీగాక టెస్టు క్రికెటం వైట్ యూనిఫామ్‌లో సరైన టైంకు లంచ్ బ్రేక్, టీ బ్రేక్ అన్ని టైంకు జరిగిపోతూ జెంటిల్‌మన్ కోడ్‌కు ఎక్కడా తగ్గరు. ఫుట్‌బాల్ ఆటకు మాదిరి ఎల్లో కార్డులు, రెడ్ కార్డులు ఉండవు. కారణం ఫిజికల్ అటాక్ లు ఏమీ జరగవు. వాళ్ల టెంపర్‌మెంట్ చూపించుకునే తీరు వేరే ఉంటుంది.
ఈ గేమ్ లో తనకు అన్యాయం జరిగిందని గతాన్ని తలచుకుని బావురుమన్నాడు పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ సయ్యద్ అజ్మల్. ఇంగ్లాండ్ ఫేసర్ జేమ్స్ అండర్‌సన్ తలను బ్యాట్ తో కొట్టినప్పటి ఘటన అది. 2010 ఎడ్జ్‌బ్యాస్టన్ లో ఇంగ్లాండ్ టెస్టు మ్యాచ్ ఆడుతున్నాం. మూడో ఇన్నింగ్స్ లో పాకిస్తాన్ పై ఒత్తిడి పెరిగింది. ప్రతి పరుగు తీయడానికి చాలా కష్టపడుతున్నాం. పాకిస్తాన్ పరిస్థితి 7 వికెట్ల నష్టానికి 153పరుగులు చేసింది.
సయ్యద్ అజ్మల్ కు పార్టనర్ గా జుల్ఖర్‌నైన్ హైదర్ క్రీజులో ఉన్నాడు. జేమ్స్ అండర్సన్.. అజ్మల్ తో నువ్వు బౌన్సర్లకు రెడీగా ఉన్నావా అని అడిగాడట. దానిని అజ్మల్ కూడా జోక్ గానే తీసుకున్నాడట. ‘ఇంగ్లాండ్ కొత్త బంతి తీసుకుంది. అండర్సన్ నా దగ్గరకొచ్చాడు. ఇంగ్లీషులో నా దగ్గరకు వచ్చి నువ్వు బౌన్సర్లకు రెడీగా ఉన్నావా అన్నాడు. అది జోక్ అనుకుని నాకు ఇంగ్లీషు రాదని చెప్పాను. నేను టెయిలెండర్ తాను స్ట్రెయిట్ బాల్ వేసి నన్ను అవుట్ చేస్తాడనుకున్నా’
‘కానీ, వాళ్లు నా మీదకు బౌన్సర్లు వేయడం మొదలుపెట్టారు. వరుసగా ఆరో.. ఏడో బౌన్సర్లు ఎదుర్కొన్నా. నేను హైదర్ తో నా బ్యాట్ తీసుకుని అండర్సన్ బుర్ర పగలగొట్టాలనుకుంటున్నానని చెప్పా. ఇక నా శైలి షాట్లు ఆడటం మొదలుపెట్టాం. క్రీజు నుంచి బయటకు వచ్చి రెండు బౌన్సర్లు ఆడా. అలా 79బంతుల్లో 50పరుగులు పూర్తి చేశా’ అని గతాన్ని గుర్తు చేసుకున్నాడు అజ్మల్.
సయ్యద్ అజ్మల్ దూస్రా బౌలింగ్ వేసి అవుట్ చేయడంలో పర్ఫెక్ట్. అతణ్ని ఐసీసీ 2015లో నిషేదించింది. 2009లో తొలి టెస్టు ఆడిన తర్వాత అతన పద్ధతి మార్చుకోవాలని సూచించింది. ఫామ్ లోకి తీసుకొచ్చిన శైలిని వదులుకోకపోవడంతో శ్రీలంకతో జరుగుతున్న 2014టెస్టు మ్యాచ్ నుంచి అతణ్ని తప్పించింది. అంతకంటే ముందు అతనికి జరిగిన యాక్సిడెంట్ ఈ నిషేదం నుంచి బయటపడేస్తుందని భావించినా.. తప్పలేదు.
ఆ ఘటనను గుర్తు చేసుకుంటూ సయ్యద్ అజ్మల్ తాను ఓ పాకిస్తానీ కాబట్టే ఐసీసీ నిషేదించింది. ముత్తయ్య మురళీధరణ్ లాంటి వాడు అంతర్జాతీయ క్రికెట్ కు వెళ్లాడు. పాకిస్తాన్ వాడిని కాబట్టే తనను పట్టించుకోలేదని అంటున్నాడు.
Also Read | మోడీ..! మాకు పొగడ్తలు కాదు.. ఆర్థిక సాయం కావాలి