Wasim Akram : హైద‌రాబాద్‌లో పాక్ దిగ్గ‌జ ఆట‌గాడు వ‌సీం అక్ర‌మ్ విగ్ర‌హం.. చూసి న‌వ్వుతున్న జనం.. ప‌రువు గోవిందా?

పాకిస్థాన్ దిగ్గ‌జ ఆట‌గాళ్ల‌లో వసీం అక్ర‌మ్ ఒక‌రు.

Wasim Akram statue

పాకిస్థాన్ దిగ్గ‌జ ఆట‌గాళ్ల‌లో వసీం అక్ర‌మ్ ఒక‌రు. పాక్ క్రికెట్‌కు ఈ మాజీ కెప్టెన్ చేసిన సేవ‌ల‌కు గుర్తింపు, గౌర‌వార్థంగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పాక్‌లోని హైద‌రాబాద్ న‌గ‌రంలోని నియాజ్ స్టేడియంలో వ‌సీం అక్ర‌మ్ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయించి ఆవిష్క‌రించింది. ప్ర‌స్తుతం ఈ విగ్ర‌హానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. దీనిపై నెట్టింట ట్రోల్స్ న‌డుస్తున్నాయి.

వసీం అక్ర‌మ్ 1992 వ‌ర‌ల్డ్ క‌ప్ జెర్సీలో ఉండేలా ఈ విగ్ర‌హాన్ని రూపొందించారు. బౌలింగ్ యాక్ష‌న్ క‌రెక్టుగానే ఉన్న‌ప్ప‌టికి, ముఖం మాత్రం హాలీవుడ్ న‌టుడు సిల్వెస్టర్ స్టాలోన్‌లా ఉంద‌ని కామెంట్స్ వ‌స్తున్నాయి. అక్ర‌మ్ ముఖంలా లేద‌ని అంటున్నారు.

Vaibhav Suryavanshi : ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు ముందు.. వైభ‌వ్ సూర్య‌వంశీ విధ్వంసం.. 90 బంతుల్లో 190 ప‌రుగులు

వ‌సీం అక్ర‌మ్ 1984 నుంచి 2003 వ‌ర‌కు పాకిస్థాన్‌కు ప్రాతినిథ్యం వ‌హించాడు. ఈ కాలంలో అత‌డు 104 టెస్టులు, 356 వ‌న్డేలు ఆడాడు. టెస్టుల్లో 414, వ‌న్డేల్లో 502 వికెట్లు తీశాడు. క్రికెట్‌ ప్రపంచంలో అత్యుత్తమ స్వింగ్ బౌలర్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. 2003లో రిటైర్మెంట్ అనంతరం కోచ్‌గా, వ్యాఖ్యాత‌గా మారాడు.

Bhuvneshwar Kumar : వార్నీ.. భువ‌నేశ్వ‌ర్ కుమార్‌లో ఈ టాలెంట్ కూడా ఉందా? ఇన్నాళ్లు తెల‌వ‌క‌పాయె..