Viral Video: మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్ వైస్ కెప్టెన్ జెమిమా రోడ్రిగ్స్ డ్యాన్స్.. అదుర్స్

ఢిల్లీ క్యాపిటల్స్ వైస్ కెప్టెన్ జెమిమా రోడ్రిగ్స్ చేసిన డ్యాన్స్ కు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టోర్నీలో నిన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ముంబైలో జరిగిన మ్యాచులో జెమిమా రోడ్రిగ్స్ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో డ్యాన్స్ చేసింది. ఆమె బౌండరీ లైన్ వద్ద ప్రేక్షకులను చూస్తూ ఏ మాత్రం మొహమాటపడకుండా హుషారుగా డ్యాన్సు చేసిన తీరు అలరిస్తోంది.

Viral Video: మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్ వైస్ కెప్టెన్ జెమిమా రోడ్రిగ్స్ డ్యాన్స్.. అదుర్స్

Viral Video

Updated On : March 6, 2023 / 3:54 PM IST

Viral Video: ఢిల్లీ క్యాపిటల్స్ వైస్ కెప్టెన్ జెమిమా రోడ్రిగ్స్ చేసిన డ్యాన్స్ కు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టోర్నీలో నిన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ముంబైలో జరిగిన మ్యాచులో జెమిమా రోడ్రిగ్స్ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో డ్యాన్స్ చేసింది. ఆమె బౌండరీ లైన్ వద్ద ప్రేక్షకులను చూస్తూ ఏ మాత్రం మొహమాటపడకుండా హుషారుగా డ్యాన్సు చేసిన తీరు అలరిస్తోంది.

నిన్న టాస్ గెలిచిన బెంగళూరు మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ ముగిసిన తర్వాత ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో జెమిమా రోడ్రిగ్స్ డ్యాన్స్ చేసింది. ఆమె భాంగ్రా స్టెప్ వేయడం కూడా గమనార్హం. స్టేడియంలో మ్యూజిక్ పెట్టిన సమయంలో అందుకు తగ్గట్టు రోడ్రిగ్స్ డ్యాన్స్ చేసింది.

కాగా, నిన్నటి మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లకు 223 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తడబడింది. నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్ల నష్టానికి 163 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

Steve Smith: చివరి టెస్టులోనూ ఆస్ట్రేలియా కెప్టెన్ అతడే.. వన్డేలకూ కమిన్స్ డౌటే..