What happen if IND vs PAK match in Womens World Cup 2025 wash out with rain
IND vs PAK : మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా నేడు (ఆదివారం అక్టోబర్ 5న) భారత్, పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. శ్రీలంకలోని కొలంబో వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభం కానుంది. అయితే.. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది.
ప్రస్తుతం కొలంబోలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం కొలంబో వేదికగా జరగాల్సిన ఆస్ట్రేలియా, శ్రీలంక మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దైంది. కనీసం టాస్ కూడా పడలేదు. ఈ క్రమంలో ఆదివారం జరగనున్న భారత్, పాక్ (IND vs PAK) మ్యాచ్ జరుగుతుందా ? లేదా ? అన్నటెన్షన్ అభిమానుల్లో నెలకొంది.
Shoaib Malik : ముచ్చటగా మూడోసారి.. విడాకులకు సిద్ధమైన సానియా మీర్జా మాజీ భర్త షోయబ్ మాలిక్..!
కొలంబోలో వాతావరణం ఎలా ఉండనుందంటే?
ఆక్యూవెదర్ రిపోర్ట్ ప్రకారం కొలంబోలో ఆదివారం ఉదయం పూట జల్లులు పడే అవకాశం ఉంది. మ్యాచ్ సమయానికి ఎలాంటి వర్షం పడకపోవచ్చు. అయితే.. ఆకాశం మేఘావృతమై ఉంటుందని సమాచారం. సాయంత్రం వేళల్లో కూడా స్వల్పంగా వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. దీంతో మ్యాచ్ పూర్తిగా రద్దు అయ్యే పరిస్థితులు లేకున్నప్పటికి కూడా మ్యాచ్‌కు అంతరాయాలు కలిగే అవకాశాలు ఉన్నాయి.
ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే.. అప్పుడు ఇరు జట్లకు ఒక్కొ పాయింట్‌ను కేటాయిస్తారు.
హెడ్-టు-హెడ్ రికార్డులు..
భారత్, పాక్ జట్లు ఇప్పటి వరకు వన్డేల్లో ముఖాముఖిగా 11 సార్లు తలపడ్డాయి. అన్ని మ్యాచ్‌ల్లోనూ భారత్ గెలుపొందింది. పాక్ జట్టు ఒక్క మ్యాచ్‌లోనూ విజయం సాధించలేదు.
పిచ్ రిపోర్టు..
ఆకాశం మేఘావృతమై ఉంటే పిచ్ పేసర్లకు సహకారం లభించవచ్చు. ఎండ కాస్తే మాత్రం స్పిన్నరకు సహకారం ఉంటుంది. బ్యాటర్లు నిలదొక్కుకుంటే పరుగుల వరద పారించవచ్చు.