Shoaib Malik : ముచ్చటగా మూడోసారి.. విడాకులకు సిద్ధమైన సానియా మీర్జా మాజీ భర్త షోయబ్ మాలిక్..!
సానియా మీర్జా మాజీ భర్త షోయబ్ మాలిక్ (Shoaib Malik) పాక్ నటి సనా జావెద్‌ను మూడో వివాహం చేసుకున్నాడు అన్న సంగతి తెలిసిందే.

Sania Mirza Ex Shoaib Malik to divorce third wife
Shoaib Malik : పాకిస్తాన్ మాజీ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన పని లేదు. తన ఆటతో పాటు టీమ్ఇండియా మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భర్తగా చాలా మందికి తెలుసు. సానియా మీర్జాకు విడాకులు ఇచ్చిన తరువాత షోయబ్ పాక్‌కు చెందిన నటి సనా జావెద్ గతేడాది పెళ్లి చేసుకున్నాడు. కాగా.. షోయబ్‌కు ఇది మూడో వివాహం కాగా సనాకు రెండో పెళ్లి అన్న సంగతి తెలిసిందే.
అయితే.. తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. సనా జావెద్‌కు సైతం షోయబ్ విడాకులు ఇచ్చేందుకు సిద్ధం అయ్యాడని సదరు వార్త సారాంశం.
హైదరాబాద్‌కు చెందిన అయేషా సిద్ధిఖీ అనే యువతిని 2002లో షోయబ్ పెళ్లి (Shoaib Malik ) చేసుకున్నాడు. 2010లో ఆమెతో వివాహ బంధానికి స్వస్తి పలికాడు. అదే ఏడాది టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జాను వివాహం చేసుకున్నాడు. హైదరాబాద్‌లో వీరి వివాహం ఎంతో ఘనంగా జరిగింది. 2018లో ఈ జంటకు ఇజన్ అనే కుమారుడు జన్మించాడు. ఆ తరువాత వీరు 2024లో విడిపోయారు.
View this post on Instagram
షోయబ్ మాలిక్ ఇతర మహిళలతో అఫైర్స్ పెట్టుకోవడం వల్లనే సానియా విసిగిపోయి విడాకులు తీసుకున్నట్లు మాలిక్ సోదరి అప్పట్లో తెలిపింది. ఇక సానియా మీర్జాకు విడాకులు ఇచ్చిన తర్వాత షోయబ్ మాలిక్ 2024లో పాక్ నటి సనాను వివాహం చేసుకున్నాడు. పెళ్లై ఏడాదిన్నర కూడా కాకుంటే ఈ జంట విడిపోతుందని అంటున్నారు.
షోయబ్, సనాకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో వీరిద్దరు పక్కపక్కనే కూర్చున్నారు. అయితే.. వారి మధ్య ఎలాంటి మాటలు చోటు చేసుకోలేదు. షోయబ్ ఆటోగ్రాఫ్‌లు ఇస్తుండగా సనా మరోవైపు ముఖం తిప్పుకుని కూర్చుంది. ఆమె ముఖంలో అసహనం చాలా స్పష్టంగా కనిపించింది. ఈ వీడియో వైరల్ కాగా.. వీడిద్దరూ విడిపోతున్నారు అనే ఊహాగానాలు జోరు అందుకున్నాయి.
IND vs PAK : నేడు భారత్, పాక్ మధ్య మ్యాచ్.. ఫ్రీగా ఎలా చూడొచ్చొ తెలుసా?
అయితే.. దీనిపై ఇప్పటి వరకు అటు షోయబ్ గానీ, అటు సనా గానీ స్పందించలేదు.