×
Ad

T20 World Cup 2026 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ను పాక్ బ‌హిష్క‌రిస్తే ఐసీసీ తీసుకునే చ‌ర్య‌లు ఇవే..?

ఒకవేళ పాక్ జ‌ట్టు టీ20 ప్ర‌పంచ‌క‌ప్ నుంచి త‌ప్పుకుంటే ఐసీసీ ఏం చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశం ఉందో ఓ సారి చూద్దాం.

What ICC to do If Pakistan Boycotts T20 World Cup 2026

T20 World Cup 2026 : ఫిబ్ర‌వ‌రి 7 నుంచి టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026 ప్రారంభం కానుంది. ఈ మెగాటోర్నీకి భార‌త్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వ‌నున్నాయి. అయితే.. ఈ మెగాటోర్నీలో పాకిస్తాన్ ఆడ‌డం పై అనిశ్చితి కొన‌సాగుతూనే ఉంది. బంగ్లాదేశ్‌కు మ‌ద్ద‌తుగా ఈ టోర్నీ నుంచి త‌ప్పుకుంటామ‌ని పాక్ బెదిరిస్తోంది. ఇక ఇప్ప‌టికే ఈ టోర్నీలో పాల్గొనే త‌మ జ‌ట్టును పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్ర‌క‌టించింది. అయిన‌ప్ప‌టికి కూడా శుక్ర‌వారం లేదా సోమ‌వారం టోర్నీలో పాల్గొన‌డం పై తుది నిర్ణ‌యం తీసుకుంటామ‌ని పీసీబీ తెలిపింది.

మెగాటోర్నీ నుంచి త‌ప్పుకోవ‌డ‌మా ? లేదంటే భార‌త్‌తో ఆడే మ్యాచ్‌ను బ‌హిష్క‌రించ‌డ‌మా? అన్నది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప‌రిశీలిస్తున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఈ మెగాటోర్నీ నుంచి పాకిస్తాన్ త‌ప్పుకుంటే ఏం జ‌రుగుతుంది అన్న దానిపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. ఒకవేళ పాక్ జ‌ట్టు టీ20 ప్ర‌పంచ‌క‌ప్ నుంచి త‌ప్పుకుంటే తీవ్ర ప‌రిణామాల‌ను ఎదుర్కోక త‌ప్ప‌దు. ఐసీసీ ఏం చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశం ఉందో ఓ సారి చూద్దాం.

T20 World Cup 2026 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ వార్మ‌ప్ మ్యాచ్‌ల షెడ్యూల్ విడుద‌ల‌.. భార‌త్ ఎవ‌రితో ఆడ‌నుందంటే?

భాగస్వామ్య ఒప్పందం ఉల్లంఘన..

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)లోని ప్రతి పూర్తి స్థాయి స‌భ్య‌దేశం మెగాటోర్న‌మెంట్ ప్రారంభానికి కొన్ని నెల‌ల ముందుగానే మెగాటోర్నీలో పార్టిసిపేషన్ అగ్రిమెంట్‌పై సంత‌కం చేస్తాయి. దీని ప్ర‌కారం చివ‌రి క్ష‌ణాల్లో టోర్నీ నుంచి నిష్ర్క‌మించిన‌ట్ల‌యితే అది ఒప్పందం ఉల్లంఘ‌న కింద‌కు వ‌స్తుంది.

అదే గ‌నుక జ‌రిగితే అప్పుడు పీసీబీ వార్షిక ఆదాయ వాటాను నిలిపివేస్తామ‌ని ఐసీసీ ఇప్ప‌టికే హెచ్చరించింది. ఐసీసీ నుంచి పీసీబీకి వార్షిక వాటా కింద దాదాపు 34.5 మిలియ‌న్ డాల‌ర్లు అంటే భార‌త క‌రెన్సీలో సుమారు 316 కోట్లు ఆదాయం వ‌స్తుంది. అస‌లే ఆర్థికంగా అంతంత‌మాత్రంగా ఉన్న పీసీబీ.. ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం కోల్పోతే మ‌రింత ఇబ్బందుల్లో ప‌డుతుంది.

T20 World Cup 2026 : అనుకోకుండా ద‌క్కిన అవ‌కాశం.. ఇక కాస్కొండి అంటున్న స్కాట్లాండ్‌.. ఏ జ‌ట్టుకు మూడిందో?

ICC ఆంక్షలు

  • ప్ర‌భుత్వం జోక్యం వ‌ల్లే పాక్ గ‌నుక ఐసీసీ టోర్నీని బ‌హిష్కిరించింద‌ని ఐసీసీ భావిస్తే.. అప్పుడు పీసీబీని నిషేదం విధిస్తుంది. గ‌తంలో ఇలాంటి కార‌ణాల‌తో జింబాబ్వే, శ్రీలంక బోర్డుల‌పై ఐసీసీ నిషేదం విధించిన సంగ‌తి తెలిసిందే.
  • ఆసియాక‌ప్‌లో పాక్ ఆడ‌డంపైనా నిషేదం ప‌డుతుంది. మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2028 హ‌క్కుల‌ను పాక్ క‌లిగి ఉంది. వీటిని కూడా ర‌ద్దు చేస్తారు.
  • పాకిస్తాన్ సూప‌ర్ లీగ్ (పీఎస్ఎల్‌)లో విదేశీ ఆట‌గాళ్లు పాల్లొన‌కుండా అడ్డుకునే అవ‌కాశం ఉంది. అది ఎలాగంటే.. విదేశీ ఆట‌గాళ్ల‌కు పీఎస్ఎల్‌లో పాల్గొన‌డానికి ఎన్ఓసీ స‌ర్టిఫికెట్‌ను ఇవ్వొద్ద‌ని త‌మ స‌భ్య దేశాలకు ఐసీసీ ఆదేశాలు జారీ చేయ‌వ‌చ్చు.
  • ఐసీసీ స‌భ్య దేశాలు పాకిస్తాన్ ద్వైపాకిక్ష సిరీస్‌లు ఆడ‌కుండా ఐసీసీ చ‌ర్య‌లు తీసుకుంటుంది. అప్పుడు పీసీబీ ఆర్థికంగా మ‌రింత న‌ష్ట‌పోతుంది.

IND vs NZ : గెలుపు జోష్‌లో ఉన్న భార‌త్‌కు భారీ షాక్.. అయ్య‌ర్‌కు మాత్రం..

కాబ‌ట్టి ఇన్ని చ‌ర్య‌ల‌ను పీసీబీ త‌ట్టుకునే అవ‌కాశం లేదు. ఈ క్ర‌మంలో పీసీబీ టీ20 ప్ర‌పంచ‌క‌ప్ నుంచి త‌ప్పుకోద‌ని ప‌లువురు క్రీడాపండితులు చెబుతున్నారు