What is the highest target successfully chased by India in Lords Tests
లండన్ వేదికగా లార్డ్స్ మైదానంలో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 387 పరుగులు చేయగా భారత్ కూడా మొదటి ఇన్నింగ్స్‌లో సరిగ్గా 387 పరుగులే చేసింది. భారత బౌలర్ల ధాటికి రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 192 పరుగులకు కుప్పకూలింది. దీంతో భారత్ ముందు 193 పరుగుల లక్ష్యం నిలిచింది.
అయితే.. లక్ష్య ఛేదనలో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 58 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్ (33) ఉన్నాడు. ఆఖరి రోజు భారత విజయానికి మరో 135 పరుగులు అవసరం. అదే సమయంలో ఇంగ్లాండ్ గెలుపుకు మరో ఆరు వికెట్లు కావాలి. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారు అన్న ఆసక్తి సర్వత్రా ఉంది. ఈ క్రమంలో లార్డ్స్ మైదానంలో ఇప్పటి వరకు ఛేదించిన అత్యధిక లక్ష్య ఛేదన ఎంత? భారత జట్టు లార్డ్స్ ఛేదించిన విజయవంతమైన ఛేదన ఎంత అనేది ఓ సారి చూద్దాం..
ENG vs IND : భారత్‌కు ఇంగ్లాండ్ కోచ్ వార్నింగ్.. తొలి గంటలోనే ఆరు వికెట్లు తీస్తాం.. కాస్కోండి
ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో టెస్టు క్రికెట్ చరిత్రలో కేవలం ఆరు సార్లు మాత్రమే 190 పరుగుల కంటే ఎక్కువ లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించారు. ఇక్కడ విశేషం ఏంటంటే.. ఇందులో గత మూడు సంవత్సరాల్లోనే రెండు సార్లు 190+ టార్గెట్‌ను చేధించారు. గత నెలలో జరిగిన డబ్ల్యూటీసీ 2025 ఫైనల్ లో ఆస్ట్రేలియా పై దక్షిణాఫ్రికా నాలుగో ఇన్నింగ్స్‌లో 282 పరుగులు ఛేదించి తొలి సారి టెస్టు ఛాంపియన్ షిప్ గదను ముద్దాడింది. అయితే.. ఈ మ్యాచ్‌లో పిచ్ మ్యాచ్ సాగుతున్న కొద్ది ఫ్లాట్‌గా మారింది.
ఇక లార్డ్స్ మైదానంలో భారత జట్టు విజయవంతమైన లక్ష్య ఛేదన 136 పరుగులు. 1986లో జరిగిన మ్యాచ్‌లో భారత్ 5 వికెట్లు కోల్పోయి ఈ లక్ష్యాన్ని ఛేదించింది.
లార్డ్స్ మైదానంలో అత్యధిక లక్ష్య ఛేదనలు ఇవే..
* ఇంగ్లాండ్ పై వెస్టిండీస్ – 1984లో 344/1
* న్యూజిలాండ్ పై ఇంగ్లాండ్ – 2004లో 282/3
* ఆస్ట్రేలియా పై దక్షిణాఫ్రికా – 2025లో 282/5
* న్యూజిలాండ్ పై ఇంగ్లాండ్ – 2022లో 279/5
* న్యూజిలాండ్ పై ఇంగ్లాండ్ – 1965లో 218/3
* వెస్టిండీస్ పై ఇంగ్లాండ్ – 2012లో 193/5