‘సమస్య అనిపిస్తే ధోనీని గుర్తు చేసుకుంటా’

ధోనీ కెప్టెన్సీలో రెండేళ్ల నుంచి ఆడుతున్నా. వికెట్ల వెనుక నుంచే గమనిస్తూ ఉంటాడు. నన్ను చాలా సార్లు మైదానంలో తిట్టేవాడు. డెత్ ఓవర్లలో..

‘సమస్య అనిపిస్తే ధోనీని గుర్తు చేసుకుంటా’

Updated On : November 13, 2019 / 9:57 AM IST

ధోనీ కెప్టెన్సీలో రెండేళ్ల నుంచి ఆడుతున్నా. వికెట్ల వెనుక నుంచే గమనిస్తూ ఉంటాడు. నన్ను చాలా సార్లు మైదానంలో తిట్టేవాడు. డెత్ ఓవర్లలో..

మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఏదైనా కష్టం అనిపిస్తే ధోనీ భాయ్ సూచనలు గుర్తు చేసుకుంటానని భారత మీడియం ఫేసర్ దీపక్ చాహర్ అంటున్నాడు. ఇటీవల హ్యాట్రిక్ వికెట్లతో సంచలనంగా మారిన చాహర్ మీడియాతో మాట్లాడుతూ సక్సెస్ మంత్ర ఏంటో చెప్పుకొచ్చాడు. చెన్నై సూపర్ కింగ్స్‌లో ధోనీ కెప్టెన్సీలో తనకు అందిన విలువైన సూచనలే విజయానికి కారణమని చెప్పుకొచ్చాడు. 

దీపక్ అంతర్జాతీయ క్రికెట్ ఆడింది కేవలం 1వన్డే, 7టీ20లు మాత్రమే మిగిలిందంతా ఐపీఎల్‌లో నేర్చుకున్నదే. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టిన తొలి భారత క్రికెటర్ గా చాహర్ నిలిచాడు. నాగ్ పూర్ వేదికగా జరిగిన మూడో టీ20లో ఈ ఫీట్ సాధించాడు. దీంతో భారత్ 30పరుగుల తేడాతో మ్యాచ్ గెలుచుకోగలిగింది.   

‘క్రెడిట్ అంతా ఐపీఎల్‌కే ఇస్తున్నా. చెన్నై సూపర్ కింగ్స్ నుంచి, ధోనీ భాయ్ దగ్గర్నుంచే అంతా నేర్చుకున్నా. బ్యాట్స్‌మన్ బాడీ లాంగ్వేజ్ తెలుసుకుని దానికి తగ్గట్లు ఎలా బౌలింగ్ వేయాలి. ఇవన్నీ అంతర్జాతీయ క్రికెట్ లో ఉపయోగపడ్డాయి. సాధారణంగానే నేను బ్యాట్యామెన్ వీడియోలు చూస్తూ ఉంటాను. ధోనీ కెప్టెన్సీలో రెండేళ్ల నుంచి ఆడుతున్నా. వికెట్ల వెనుక నుంచే గమనిస్తూ ఉంటాడు. నన్ను చాలా సార్లు మైదానంలో తిట్టేవాడు. డెత్ ఓవర్లలో బౌలింగ్ వేయడం చాలా కష్టం. ఇవన్నీ ధోనీ భాయ్ నుంచే నేర్చుకున్నా. అవన్నీ అంతర్జాతీయ క్రికెట్ లో ఉపయోగపడుతున్నాయి’ అని దీపక్ చాహర్ చెప్పుకొచ్చాడు.