నాకు అసలు అర్జునా అవార్డు వస్తుందా?: మోడీకి లేఖ రాసిన సాక్షి

అర్జున అవార్డు లిస్ట్‌లో నుంచి కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ రెజ్లర్ సాక్షి మాలిక్‌ను తొలగించడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దేశం తరపున ఇంకేమి సాధిస్తే అర్జున ఇస్తారో చెప్పాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, క్రీడా మంత్రి కిరణ్ బిజూజుకు లేఖ రాశారు. గతంలో కేల్ రత్న అవార్డుతో గౌరవించినందుకు గర్విస్తున్నానని, అయితే క్రీడాకారులు అన్ని అవార్డులను అందుకోవాలని కలలు కంటారని, అందుకోసం ఎంతో శ్రమిస్తారని, తనకు కూడా అర్జున అవార్డు దక్కాలని కలలు కన్నానని చెప్పుకొచ్చారు.
‘ప్రతీ అథ్లెట్ అవార్డులు గెలుచుకోవాలని కలలు కంటారు. నేను కూడా అలాగే అర్జున పురస్కారం దక్కించుకోవాలని అనుకున్నా. ఇంకా ఎన్ని పతకాలు సాధిస్తే.. ఆ గౌరవం నాకు దక్కుతుంది. అసలు నా కెరీర్ మొత్తంలో నేను అర్జున అవార్డు గెలుచుకోగలనా?’ అని అందులో రాసుకొచ్చింది. 2016 రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం నెగ్గిన సాక్షికి ఆ ఏడాదే దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్ రత్న దక్కింది. కాగా, అత్యున్నత అవార్డు పొందిన వారికి అర్జున ఇచ్చేది లేదని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
ఖేల్‌రత్న అవార్డు అందుకున్న వారికి అర్జున అవార్డు ఇవ్వరాదని క్రీడాశాఖ నిర్ణయించింది. దీంతో అర్జున రేసులో నిలిచిన రెజ్లర్ సాక్షి మాలిక్, వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చానుకు నిరాశ ఎదురైంది. సాక్షి 2016లో, చాను 2018లో ఖేల్‌రత్న అవార్డు అందుకున్నారు. సాక్షి మాలిక్ 2017లో జరిగిన కామన్వెల్త్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం, న్యూఢిల్లీలో జరిగిన ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో రజతం గెలుచుకున్నారు. గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన 2018 కామన్వెల్త్ క్రీడల్లో కాంస్యం కూడా సాధించారు.
माननीय प्रधानमंत्री @narendramodi जी ओर माननीय खेल मंत्री @KirenRijiju जी । pic.twitter.com/YF1hQuJfPi
— Sakshi Malik (@SakshiMalik) August 22, 2020