IPL 2025 : ఐపీఎల్ మ్యాచ్‌ల్లో దీన్ని గ‌మ‌నించారా? ప్ర‌తి డాట్ బాల్‌కి స్కోర్ కార్డ్‌లో ఆకుప‌చ్చ చెట్టు చిహ్నాలు.. ఎందుకంటే..?

ఓవ‌ర్‌లో ఓ బంతికి ప‌రుగులు రాకుంటే స్కోరు గ్రాఫిక్ కార్డులో డాట్‌లు క‌నిపించాలి కానీ.. ఆకుప‌చ్చ చెట్ల చిహ్నాలు క‌నిపిస్తున్నాయి.

Why are green tree symbols showing up for every dot ball in IPL 2025

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో మ్యాచ్‌లు ఆస‌క్తిక‌రంగా సాగుతున్నాయి. ఈ సీజ‌న్ ప్రారంభానికి ముందు టైటిల్ ఫేవ‌రెట్లు అనుకున్న జ‌ట్లు కాస్త పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న చేస్తుండ‌గా.. అస‌లు అంచ‌నాలు లేని జ‌ట్లు అద్భుతంగా రాణిస్తున్నారు.

చెన్నై సూప‌ర్ కింగ్స్‌, ముంబై ఇండియ‌న్స్, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్లు వ‌రుస ఓటుమ‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతుండ‌గా.. ఢిల్లీ క్యాపిట‌ల్స్‌, గుజ‌రాత్ టైటాన్స్ వంటి జ‌ట్లు వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్నాయి.

IPL 2025 LSG vs GT preview : ల‌క్నో, గుజ‌రాత్‌ల‌లో పైచేయి ఎవ‌రిదో తెలుసా? పిచ్ రిపోర్ట్‌, హెడ్-టు-హెడ్‌, తుది జ‌ట్ల అంచ‌నా..

ఈ విష‌యాల‌ను అన్ని కాస్త ప‌క్క‌న బెడితే.. ఓవ‌ర్‌లో ఓ బంతికి ప‌రుగులు రాకుంటే.. స్కోరు గ్రాఫిక్ కార్డులో డాట్‌లు క‌నిపించాలి కానీ.. ఆకుప‌చ్చ చెట్ల చిహ్నాలు క‌నిపిస్తున్నాయి. ఇలా ఎందుకు క‌నిపిస్తుంద‌ని కొంద‌రికి తెలిసినా చాలా మందికి.. ఇలా ఎందుకు ఇస్తున్నారో అర్థం కావ‌డం లేదు.

ప్ర‌తి డాట్ బాల్‌కు 500 మొక్క‌లు..

భారత క్రికెట్ నియంత్రణ మండలి చేపట్టిన హరిత కార్యక్రమంలో భాగంగా ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. టాటా గ్రూప్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్న బీసీసీఐ.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో వేసే ప్రతి డాట్ బాల్‌కు 500 చెట్లను నాటాలని టాటా గ్రూప్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.

CSK vs KKR : ధోని ప్లాన్ ఫెయిల్‌.. కోటీ 70ల‌క్ష‌లు దండ‌గా.. వికెట్లు ప‌డుతున్నాయ‌ని..

ఈ క్ర‌మంలో ఇలా డాట్ బాల్ స్థానంలో ఆకుప‌చ్చ‌ని మొక్క‌ల చిహ్నాల‌ను ఇస్తున్నారు. ఐపీఎల్ సీజ‌న్ పూర్తి అయిన త‌రువాత మొత్తం ఎన్ని డాట్ బాల్ ప‌డ్డాయ‌ని లెక్క‌గ‌ట్టి.. ఒక్కొ డాట్ బాల్‌కు 500 మొక్కలు నాట‌నున్నారు. గ‌త రెండు సీజ‌న్ల‌లో కూడా ఇలాగే చేశారు.