Courtesy BCCI
శనివారం నుంచి ఐపీఎల్ 2025 పునఃప్రారంభం కానుంది. అయితే.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఢిల్లీ క్యాపిటల్స్ పై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. #BoycottDelhiCapitals ను ట్రెండింగ్ చేస్తున్నారు.
భారత్, పాక్ ఉద్రిక్తల కారణంగా వారం రోజుల పాటు ఐపీఎల్ 2025 వాయిదా పడడంతో పలువురు విదేశీ ఆటగాళ్లు వారి వారి స్వస్థలాలకు వెళ్లిపోయారు. ఇప్పుడు వీరిలో కొందరు తిరిగి వస్తుండగా ఇంకొందరు అంతర్జాతీయ సిరీస్‌లు, గాయాల కారణంగా రావడం లేదు. ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ తాను రానని స్పష్టం చేశాడు.
దీంతో ఢిల్లీ మేనేజ్‌మెంట్ ఈ బ్యాటర్ స్థానంలో బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ ను జట్టులోకి తీసుకుంది. ఈ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌ల్లో ఆడేందుకు రూ.6 కోట్లతో ఒప్పందం చేసుకుంది. అయితే.. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఆ దేశ ఆటగాడిని ఎలా తీసుకుంటారని భారత అభిమానులు ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం పై మండిపడుతున్నారు.
ఇటీవల నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో పాక్‌కు బంగ్లా మద్దతు ఇచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తే ముస్తాఫిజుర్ ఎంపిక చేసుకోవడాన్ని తప్పుబడుతున్నారు. ఈ క్రమంలోనే #BoycottDelhiCapitals ను ట్రెండ్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. తనను జట్టులోకి తీసుకున్నట్లు ఢిల్లీ క్యాపిటల్స్ ప్రకటించిన కొన్ని గంటలకే ముస్తాఫిజుర్ ఆ జట్టుకు భారీ షాక్ ఇచ్చాడు. జాతీయ జట్టు తరుపున ఆడేందుకు యూఏఈ వెలుతున్నట్లు తన సోషల్ మీడియా ఖాతాలో అతడు పోస్ట్ చేశాడు. ఐపీఎల్‌లో ఆడేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అతడిని నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వనట్లుగా తెలుస్తోంది. దీంతో అతడు ఐపీఎల్‌లో ఆడనట్లే
ఐపీఎల్ లో ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఇప్పటి వరకు 57 మ్యాచ్‌లు ఆడాడు 61 వికెట్లు పడగొట్టాడు.
— Avinash Kumar (@avi_9ash) May 14, 2025
Bravo, @ParthJindal11 While Indian soldiers guard our borders, you’re busy rewarding players from a country cheering for Pakistan. Truly visionary leadership — business over backbone, runs over respect. #BoycottDelhiCapitals #Shameful
— Parth Awasthi (@parthggmu07) May 14, 2025
Deshdrohi team #DelhiCapitals
— Shivankar Rajneesh Awasthi 🇮🇳 (@iamshiv08) May 14, 2025
Have lived in delhi all my life and supported delhi daredevils and now Delhi capitals since the inception. Even was part of a fan club – but today – the journey ends! Cannot support a team that has a Bangladeshi. Shameful decision and one that will see lots of fans turning away.
— sportyvirus (@sportyvirus) May 14, 2025