IPL 2025 : ఐపీఎల్ 2025 పునఃప్రారంభానికి ముందు.. ఆసక్తి రేపుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ ప్లేయర్ పోస్ట్..
టీమ్ఇండియా ఆటగాడు, ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ ఓపెనర్ పృథ్వీ సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది.

Prithvi Shaw Shares Cryptic Post Ahead Of IPL 2025 Resumption
భారత్, పాక్ ల మధ్య ఉద్రిక్తతల కారణంగా వారం రోజుల పాటు వాయిదా పడిన ఐపీఎల్ 2025 సీజన్ మళ్లీ మే 17(శనివారం) నుంచి పునఃప్రారంభం కానుంది. ఐపీఎల్ వాయిదా పడడంతో స్వదేశాలకు వెళ్లిపోయిన విదేశీ ఆటగాళ్లలలో కొందరు అంతర్జాతీయ సిరీస్‌లు, గాయాల కారణంగా మిగిలిన మ్యాచ్‌లకు దూరం అవుతున్నారు. ఈ క్రమంలో ఐపీఎల్ ఫ్రాంఛైజీలు తాత్కాలిక రీప్లేస్‌మెంట్ల కోసం వెతుకుతున్నాయి. ఈ సమయంలో టీమ్ఇండియా ఆటగాడు, ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ ఓపెనర్ పృథ్వీ సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది.
తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో నీడ్ ఎ బ్రేక్ అని పోస్ట్ పెట్టాడు. దీన్ని చూసిన అభిమానులు ఐపీఎల్‌లో రీప్లేస్‌మెంట్ ఆటగాడిగా వచ్చేందుకు షా ఆసక్తి చూపిస్తున్నాడని కామెంట్లు చేస్తున్నారు.
75 లక్షల బేస్ ప్రైజ్‌తో ఐపీఎల్ 2025 మెగావేలంలో అడుగుపెట్టిన పృథ్వీ షాను ఏ ప్రాంఛైజీ కొనుగోలు చేయలేదు. ఐపీఎల్ 2024 ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున ఆడిన షా ఓ మోస్తరుగా రాణించాడు. ఆ సీజన్‌లో కేవలం 8 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన షా 24.75 సగటు, 163.63 స్ట్రైక్‌రేటుతో 198 పరుగులు సాధించాడు.
Prithvi Shaw Instagram Story #IPL2025 pic.twitter.com/jrOwH2Tx0h
— Raja (@_raja_kumar) May 14, 2025
2018లో ఐపీఎల్‌లో అరంగ్రేటం చేసిన షా ఇప్పటి వరకు 79 మ్యాచ్‌లు ఆడాడు. 23.94 సగటు 147.46 స్ట్రైక్‌రేటుతో 1892 పరుగులు చేశాడు. అతడి ట్రాక్ రికార్డు బాగునప్పటికి కూడా ఫామ్ కోల్పోవడం, వ్యక్తిగత అలవాట్లు, ఫిట్‌నెస్ పై దృష్టి పెట్టకపోవడం వంటి విషయాలు ఐపీఎల్‌తో పాటు దేశవాలీ క్రికెట్‌కు అతడిని దూరం చేశారు.
దేశవాలీ క్రికెట్‌లో చివరి సారిగా అతడు 2024-25 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై తరుపున ఆడాడు. 21.88 సగటు 156.34 స్ట్రైక్‌రేటుతో 197 పరుగులు చేశాడు. అతడి ప్రదర్శన అంచనాలను అందుకోకపోవడం, ఫిట్‌నెస్ సమస్యల కారణంగా అతడిని ముంబై తమ జట్టు నుంచి తొలగించింది.
2018లోనే అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగ్రేటం చేసిన షా ఇప్పటి వరకు భారత్ తరుపున 5 టెస్టులు, 6 వన్డేలు, ఓ టీ20 మ్యాచ్ ఆడాడు. టెస్టుల్లో 42.4 సగటుతో 339 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, రెండు అర్థశతకాలు ఉన్నాయి. వన్డేల్లో 31.5 సగటుతో 49 పరుగులు చేశాడు. ఆడిన ఒక్క టీ20 మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. అతడు చివరి సారిగా 2021లో భారత్ తరుపున ఆడాడు.
చూడాలి మరీ షాను ఏదైన ఐపీఎల్ ఫ్రాంఛైజీ కరుణిస్తుందో లేదో..