IPL-PSL : ఐపీఎల్ నుంచి 26 కోట్లకు పైగా అందుకుని.. పాకిస్థాన్ సూపర్ లీగ్ 2025 ఆడేందుకు వెళ్లిన మాజీ కేకేఆర్ స్టార్ క్రికెటర్..
భద్రతా సమస్యల కారణంగా చాలా మంది విదేశీ ఆటగాళ్లు పాక్‌లో అడుగుపెట్టమని చెబుతున్నట్లుగా వార్తలు వస్తుండగా బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ మాత్రం పీఎస్ఎల్ ఆడేందుకు సిద్ధం అయ్యాడు.

After earning 26 crore from IPL ex KKR star now heads to play in PSL 2025
భారత్, పాక్ ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడిన పాకిస్థాన్ సూపర్ లీగ్ 2025 (పీఎస్ఎల్) మే 17 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. భద్రతా సమస్యల కారణంగా చాలా మంది విదేశీ ఆటగాళ్లు పాక్‌లో అడుగుపెట్టమని చెబుతున్నట్లుగా వార్తలు వస్తుండగా బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ మాత్రం పీఎస్ఎల్ లో ఆడేందుకు సిద్ధం అయ్యాడు.
ఈ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌ల కోసం షకీబ్‌తో లాహోర్ ఖలందర్స్ ఒప్పందం చేసుకుంది. సవరించిన షెడ్యూల్ ప్రకారం లాహోర్ ఖలందర్స్ మే 18న రావల్పిండి క్రికెట్ స్టేడియంలో పెషావర్ జల్మీతో తలపడనుంది.
8 ఏళ్ల తరువాత..
దాదాపు ఎనిమిదేళ్ల తరువాత షకీబ్ పీఎస్ఎల్‌లో ఆడనున్నాడు. 2016లో కరాచీ కింగ్స్‌కు, 2017లో పెషావర్ జల్మీలకు షకీబ్ ప్రాతినిథ్యం వహించాడు. మొత్తంగా పీఎస్ఎల్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన షకీబ్ 16.36 సగటు, 107.14 స్ట్రైక్‌రేటుతో 181 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 8 వికెట్లు తీశాడు.
ఐపీఎల్‌లో గట్టిగానే సంపాదించాడు.
ఈ స్టార్ ఆల్‌రౌండర్ 11 సీజన్ల పాటు ఐపీఎల్ ఆడి మొత్తం 26.25 కోట్లు జీతంగా సంపాదించాడు. 2011లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో అతడి ఐపీఎల్ ప్రయాణం ప్రారంభమైంది. రూ.1.95 కోట్లకు కేకేఆర్ దక్కించుకుంది. దాదాపు ఏడు సీజన్ల పాటు కేకేఆర్ కు షకీబ్ ప్రాతినిథ్యం వహించాడు. 2018లో అతడిని సన్‌రైజర్స్ రూ.2 కోట్ల మొత్తానికి సొంతం చేసుకుంది. 2019లో అతడిని ఎస్ఆర్‌హెచ్ రీటైన్ చేసుకుంది. ఆ తరువాత అతడిని విడిచిపెట్టింది. 2021లో తిరిగి అతడిని కేకేఆర్ సొంతం చేసుకుంది. 2023లో అతడు చివరి సారిగా ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. కోటి బేస్‌ప్రైజ్‌తో ఐపీఎల్ 2025 వేలంలోకి వచ్చిన అతడిని ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయలేదు.
కాగా.. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు షకీబ్ రిటైర్‌మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.