Why MS Dhoni Is Not Eligible To Apply For India Head Coach Job
ప్రస్తుత టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్ పదవికాలం టీ20 ప్రపంచకప్‌తో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త కోచ్ కోసం బీసీసీఐ వేట మొదలెట్టింది. కాగా.. టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని భారత జట్టుకు కోచ్‌గా రావాలని చాలా మంది కోరుకుంటున్నారు. అయితే.. భారత జట్టు కోచ్ పదవికి దరఖాస్తు చేసుకునేందుకు ధోని అర్హుడు కాదు.
అన్ని ఫార్మాట్‌లోనూ రిటైర్‌మెంట్ తీసుకున్న ఆటగాళ్లు మాత్రమే టీమ్ఇండియా హెడ్‌కోచ్ పదవికి అర్హులు అని బీసీసీఐ నిబంధనల్లో స్పష్టం చేసింది. ధోని అంతర్జాతీయ క్రికెట్ కు 2020 ఆగస్టు 15న వీడ్కోలు పలికినప్పటికి చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ప్రస్తుతం ఐపీఎల్‌లో ఆడుతున్నాడు. ఈ లెక్కన ధోని దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లేదు. మహేంద్రుడికి ఐపీఎల్ 2024 సీజన్ చివరిది అని ప్రచారం జరిగినప్పటికీ కూడా ధోని ఈ దీనిపై స్పందించలేదు.
ధోని ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్ 17వ సీజన్‌లో అతడు 220 కంటే ఎక్కువ స్ట్రైక్‌రేటుతో పరుగులు రాబట్టాడు. 11 ఇన్నింగ్స్‌ల్లో కేవలం మూడు సందర్భాల్లో మాత్రమే అతడు ఔట్ అయ్యాడు. కాగా.. 2021లో యూఏఈలో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో ధోని టీమ్ఇండియాకు మెంటార్‌గా వ్యవహరించాడు. ఆటోర్నీలో భారత్ గ్రూప్ దశలోనే ఓడిపోయింది.
భారత కొత్త ప్రధాన కోచ్‌గా ఎవరు ఫేవరెట్?
భారత ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తులు సోమవారంతో ముగిశాయి. అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి బీసీసీఐ పబ్లిక్ గూగుల్ ఫారమ్‌ను విడుదల చేసింది. 3 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించిన ప్రకారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, సచిన్ టెండూల్కర్ పేర్లతో చాలా నకిలీ దరఖాస్తులు వచ్చాయి.
Viral Video : ఈవీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు.. రనౌట్ చేసేందుకు చిన్నారుల పాట్లు.. అయ్యో పాపం
కేకేఆర్‌కు మూడోసారి కప్పును అందించిన ఆ జట్టు మెంటార్ గౌతమ్ గంభీర్ రేసులో అందరి కన్నా ముందు ఉన్నాడని అంటున్నారు.