Wimbledon 2021 : బాలుర వింబుల్డన్ విజేతగా నిలిచిన సమీర్

Wimbledon 2021

Wimbledon 2021 : వింబుల్డన్ బాలుర విభాగంలో భారతీయ – అమెరికన్ సమీర్ బెనర్జీ (17) విజయం సాధించాడు. ఫైనల్ లో అమెరికాకు చెందిన విక్టర్ లిలోవ్‌ తో తలపడిన సమీర్ 7-5, 6-3 తేడాతో గెలిచాడు. మొదటి సెట్ నువ్వా నేనా అన్నట్లు సాగింది.. కానీ రెండో సెట్లో సమీర్ పైచేయి సాధించాడు.

మొదటి సెట్ లో గట్టి పోటీ ఇచ్చిన లివోవ్, రెండో సెట్లో తడబడ్డాడు. దీంతో మ్యాచ్ రెండు సెట్లలోనే ముగిసింది. ఈ మ్యాచ్ 1.21 నిమిషాల పాటు సాగింది. ఒకే ఈవెంట్‌లో ఇద్దరు అమెరికన్ బాయ్స్ తలపడడం 2014 తర్వాత ఇదే తొలిసారి కాగా, 1977 తర్వాత ఇది రెండోసారి. సమీర్, విక్టర్ ఇద్దరూ అన్‌సీడెడ్ ఆటగాళ్లు కావడం గమనార్హం.

జూనియర్ గ్రాండ్ స్లామ్ లో పటిపడ్డ రెండోసారే సమీర్ బెనర్జీ ఈ ఘనత సాధించాడు. సమీర్ విజయాన్ని వింబుల్డన్ ప్రశంసించింది. రానున్న రోజుల్లో పురుషుల విజేత అయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.