Smriti Mandhana : బంగ్లాదేశ్‌తో సెమీస్ మ్యాచ్.. స్మృతి మంధానను ఊరిస్తున్న భారీ రికార్డు..
మహిళల ఆసియాకప్ 2026లో భాగంగా బంగ్లాదేశ్‌తో నేడు భారత్ సెమీస్ మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో స్మృతి మంధాన (Smriti Mandhana)భారీ రికార్డుపై కన్నేసింది.
- Thota Vamshi Kumar
- Updated on- September 10, 2026 / 12:00 PM IST
Womens Asia Cup 2026 IND-wVSBAN-w Smriti Mandhana eye on most runs in t20 international cricket
Smriti Mandhana : మహిళల ఆసియాకప్ 2026లో భాగంగా సెమీస్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో భారత్ నేడు (సెప్టెంబర్ 10న)తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధానను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో మంధాన 69 పరుగులు చేస్తే.. అంతర్జాతీయ మహిళల టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్‌గా మంధాన చరిత్ర సృష్టిస్తుంది.
ప్రస్తుతం ఈ రికార్డు న్యూజిలాండ్ బ్యాటర్ సుజీ బేట్స్ పేరిట ఉంది. బేట్స్ 186 మ్యాచ్‌ల్లో 28.83 సగటుతో 4758 పరుగులు చేసింది. ఇందులో ఓ సెంచరీ 28 అర్థశతకాలు ఉన్నాయి. ఇక మంధాన 174 మ్యాచ్‌లు ఆడింది. 30.65 సగటుతో 4690 పరుగులు సాధించింది. ఇందులో రెండు శతకాలు 35 అర్థశతకాలు ఉన్నాయి. ఇక ఈ జాబితాలో భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మూడో స్థానంలో ఉంది. 184 మ్యాచ్‌ల్లో 30.13 సగటుతో 4249 పరుగులు చేసింది. ఇందులో ఓ సెంచరీ 18 అర్థశతకాలు ఉన్నాయి.
IND W vs BAN W : ఆసియాకప్‌లో భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ సెమీస్ నేడే.. ఎక్కడ చూడొచ్చంటే?
అంతర్జాతీయ మహిళల టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లు వీరే..
* సుజీ బేట్స్ (న్యూజిలాండ్) – 186 మ్యాచ్‌ల్లో 4758 పరుగులు
* స్మృతి మంధాన (భారత్) – 174 మ్యాచ్‌ల్లో 4690 పరుగులు
* హర్మన్ ప్రీత్ కౌర్ (భారత్) – 205 మ్యాచ్‌ల్లో 4249 పరుగులు
* చమరి ఆటపట్టు (శ్రీలంక) – 168 మ్యాచ్‌ల్లో 4095 పరుగులు
* సోఫీ డివైన్ (న్యూజిలాండ్) – 158 మ్యాచ్‌ల్లో 3817 పరుగులు
ఇదిలా ఉంటే.. భారత్, బంగ్లాదేశ్‌లు ఇప్పటి వరకు 21 టీ20ల్లో ముఖాముఖిగా తలపడ్డాయి. ఇందులో భారత జట్టు 21 మ్యాచ్‌ల్లో గెలుపొందగా బంగ్లాదేశ్ కేవలం 3 మ్యాచ్‌ల్లోనే విజయం సాధించింది.
