Womens ODI World cup 2025 : బెంగ‌ళూరుకు భారీ షాక్‌.. మ‌హిళ‌ల వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2025 షెడ్యూల్‌లో స్వ‌ల్ప మార్పులు..

సెప్టెంబ‌ర్ 30 నుంచి మ‌హిళ‌ల వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2025 (Womens ODI World cup 2025) ప్రారంభం కానుంది. షెడ్యూల్‌ను విడుద‌ల చేయ‌గా..

Womens ODI World cup 2025 NAVI MUMBAI REPLACED BENGALURU

Womens ODI World cup 2025 : సెప్టెంబ‌ర్ 30 నుంచి మ‌హిళ‌ల వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2025 (Womens ODI World cup 2025) ప్రారంభం కానుంది. ఇప్ప‌టికే ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుద‌ల చేయ‌గా.. తాజాగా ఈ షెడ్యూల్‌లో స్వ‌ల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మెగా టోర్నీలోని కొన్ని మ్యాచ్‌ల‌కు బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియం ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది.

అయితే.. ఆ మ్యాచ్‌ల‌ను బెంగ‌ళూరు నుంచి న‌వీ ముంబైకి త‌ర‌లించిన‌ట్లు ఐసీసీ ఓ ప్ర‌క‌ట‌న‌లో స్ప‌ష్టం చేసింది. న‌వీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో మూడు లీగ్ మ్యాచ్‌లు, ఓ సెమీఫైన‌ల్‌, ఫైన‌ల్‌తో స‌హా ఐదు మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. అయితే.. బెంగ‌ళూరు నుంచి న‌వీ ముంబైకి మ్యాచ్‌లు త‌ర‌లించ‌డానికి గ‌ల కార‌ణాల‌ను మాత్రం వెల్ల‌డించ‌లేదు.

Matthew Breetzke : చ‌రిత్ర సృష్టించిన ద‌క్షిణాఫ్రికా యువ ఆట‌గాడు మాథ్యూ బ్రీట్జ్కే.. వ‌న్డే క్రికెట్ చ‌రిత్ర‌లో ఒకే ఒక్క‌డు..

‘ఊహించని పరిస్థితుల కారణంగా షెడ్యూల్‌ను సర్దుబాటు చేసి, వేదికను మార్చాల్సి వచ్చినప్పటికీ, మహిళల ఆటలోని అత్యుత్తమ ప్రదర్శనలను ప్రదర్శించే ఐదు ప్రపంచ స్థాయి వేదికల శ్రేణిని కలిగి ఉండటం మాకు సంతోషంగా ఉంది. వేదిక సిద్ధమైంది.. ఈ టోర్న‌మెంట్ అభిమానుల‌ను అల‌రిస్తుంద‌ని ఆశిస్తున్నాం.’ అని ఐసీసీ ఛైర్మ‌న్ జైషా అన్నారు.

8 జ‌ట్లు క‌ప్పు కోసం పోటీప‌డుతున్నాయి. న‌వీ ముంబైతో పాటు గౌహతి, ఇండోర్, విశాఖపట్నం, కొలంబో లు ఇతర వేదికలుగా ఉన్నాయి. ఐసీసీ ఖ‌చ్చిత‌మైన కార‌ణాల‌ను వెల్ల‌డించ‌న‌ప్ప‌టికి.. క‌ర్ణాట‌క క్రికెట్ అసోసియేష‌న్ చిన్న‌స్వామిలో మ్యాచ్‌ల‌ను నిర్వ‌హించేందుకు అవ‌స‌ర‌మైన అనుమ‌తుల‌ను పొంద‌లేక‌పోయిన‌ట్లుగా తెలుస్తోంది.

Sanju Samson : ఆసియాక‌ప్ 2025కి ముందు సంజూ శాంస‌న్ కీల‌క నిర్ణ‌యం.. ఓపెన‌ర్ కాద‌ని చెప్పేశారా?

ఐపీఎల్ 2025 ఫైన‌ల్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు విజ‌యం సాధించింది. ఈ క్ర‌మంలో ఆర్‌సీబీ చిన్న‌స్వామి వేదిక‌గా విజ‌యోత్స‌వ వేడుకల‌ను నిర్వ‌హించింది. ఈ వేడుక‌ల సంద‌ర్భంగా జ‌రిగిన తొక్కిస‌లాట‌లో ప‌లువురు అభిమానులు మ‌ర‌ణించారు. తొక్కిస‌లాట ఘ‌ట‌న‌పై విచార‌ణ త‌రువాత‌ చిన్న‌స్వామి స్టేడియంలో పెద్ద ఈవెంట్ల‌ను నిర్వ‌హించ‌కూడ‌ని పేర్కొన్న సంగ‌తి తెలిసిందే.

మ‌హిళ‌ల వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ రీవైజ్ షెడ్యూల్ ఇదే..