Women’s T20 World Cup 2023: స్మృతి మంధాన ఆడుతుందా.. టాప్ ప్లేస్ అందుతుందా?
Women's T20 World Cup 2023: వుమెన్స్ టీ20 ప్రపంచకప్ భాగంగా బుధవారం భారత మహిళల జట్టు తన రెండో మ్యాచ్ ఆడనుంది.

Women’s T20 World Cup 2023: వుమెన్స్ టీ20 ప్రపంచకప్ భాగంగా బుధవారం భారత మహిళల జట్టు తన రెండో మ్యాచ్ ఆడనుంది. గ్రూప్ బీ లీగ్ పోరులో వెస్టిండీస్ తో టీమిండియా తలపడుతుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని ఇండియన్ తన తొలి మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై విజయాన్ని నమోదు చేసింది. విండీస్ పైనా గెలిచి గ్రూప్ బీలో టాప్ ప్లేస్ కు చేరాలని భారత్ భావిస్తోంది. 4 పాయింట్లతో ఇంగ్లండ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. 2 పాయింట్లతో ఇండియా సెకండ్ పొజిషన్ లో కొనసాగుతోంది.
వేలి గాయం కారణంగా తొలి గేమ్‌కు దూరమైన ఓపెనర్ స్మృతి మంధాన విండీస్ తో మ్యాచ్ ఆడతుందా, లేదా అనేది ఇంకా స్పష్టం కాలేదు. స్మృతి మంధాన జట్టులోకి వస్తే యాస్తికా భాటియా బెంచ్ కు పరిమితం కావాల్సి వస్తుంది. రెగ్యులర్ ఓపెనర్ స్మృతి మంధాన ప్లేస్ లో జట్టులోకి వచ్చిన ఆమె వార్మప్ సహా పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లోనూ రాణించలేకపోయింది.
Also Read: Women’s Premier League షెడ్యూల్ వచ్చేసింది.. మార్చి 4న గుజరాత్-ముంబై మధ్య తొలి మ్యాచ్
షెఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్ పాకిస్తాన్ మ్యాచ్ లో సత్తా చాటారు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 12 బంతుల్లో 16 పరుగులు చేసింది. తర్వాతి మ్యాచ్ ల్లో భారీ స్కోరు చేయాలని ఆమె పట్టుదలగా ఉన్నట్టు కనబడుతోంది. మొదటి మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించిన రిచా ఘోష్ అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. ఆల్ రౌండర్లు పూజా వస్త్రకార్, దీప్తి శర్మ కీలక సమయాల్లో మ్యాచ్ ను మలుపు తిప్పగలరు. రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, రేణుకా సింగ్ బౌలింగ్ పదును తేలితే భారత జట్టు విజయానికి ఢోకా ఉండదు.