Women’s Premier League: షెడ్యూల్ వచ్చేసింది.. మార్చి 4న గుజరాత్-ముంబై మధ్య తొలి మ్యాచ్

డబ్ల్యూపీఎల్ తొలి సీజన్ లో మొత్తం 20 లీగ్ మ్యాచులు.. 2 ప్లే ఆఫ్ మ్యాచులు.. 23 రోజుల పాటు జరుగుతాయి. మార్చి 4న తొలి మ్యాచు ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరుగుతుంది. మార్చి 5న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య బ్రబౌర్న్ స్టేడియంలో మ్యాచు జరుగుతుంది.

Women’s Premier League: షెడ్యూల్ వచ్చేసింది.. మార్చి 4న గుజరాత్-ముంబై మధ్య తొలి మ్యాచ్

Border-Gavaskar Trophy

Women’s Premier League: విమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం నిన్న ముంబైలో ముగిసిన నేపథ్యంలో బీసీసీఐ డబ్ల్యూపీఎల్ షెడ్యూల్ ను ప్రకటించింది. మార్చి 4 నుంచి డబ్ల్యూపీఎల్ మ్యాచులు ప్రారంభం కానున్నాయి. మొదటి మ్యాచు గుజరాత్ జెయింట్స్-ముంబై ఇండియన్స్ మధ్య జరగనుంది. డబ్ల్యూపీఎల్ లో ఐదు జట్లు ఆడనున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, యూపీ వారియర్స్ జట్లు తలపడతాయి.

డబ్ల్యూపీఎల్ తొలి సీజన్ లో మొత్తం 20 లీగ్ మ్యాచులు.. 2 ప్లే ఆఫ్ మ్యాచులు.. 23 రోజుల పాటు జరుగుతాయి. మార్చి 4న తొలి మ్యాచు ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరుగుతుంది. మార్చి 5న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య బ్రబౌర్న్ స్టేడియంలో మ్యాచు జరుగుతుంది.

అలాగే, డీవై పాటిల్ స్టేడియంలో యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య మరో మ్యాచు జరుగుతుంది. కాగా, డీవై పాటిల్ స్టేడియం, బ్రబౌర్న్ స్టేడియంలో మొత్తం 11 మ్యాచుల చొప్పున జరగనున్నాయి. మార్చి 24న డీవై పాటిల్ స్టేడియంలో ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. ఫైనల్ మ్యాచు మార్చి 26న ఉంటుంది. మార్చి 4న ప్రారంభమయ్యే మ్యాచులు మార్చి 26తో ముగుస్తాయి. వేలం పాటలో మొత్తం 87 మంది క్రికెటర్లను ఆయా ఫ్రాంచైజీలు దక్కించుకున్నాయి.

విమెన్స్ ప్రీమియర్ లీగ్ పూర్తి షెడ్యూల్ కోసం క్లిక్ చేయండి.. 2023_WPL_Schedule_v3

Lingamaneni Ramesh: చైతన్య గ్రూప్ అఫ్ కాలేజీస్ చైర్మెన్ బీఎస్ రావు సంచలన ఆరోపణలు