Womens T20 World Cup 2024 We Can Beat Any Team Harmanpreet Kaur
Harmanpreet Kaur – T20 World Cup 2024 : యూఏఈ వేదికగా అక్టోబర్ 3 నుంచి మహిళల టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఈ మెగాటోర్నీలో పాల్గొనేందుకు భారత మహిళల జట్టు యూఏఈ విమానం ఎక్కింది. అయితే.. అంతకన్నా ముందు విలేకరుల సమావేశంలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మాట్లాడింది. టీ20 ప్రపంచకప్‌తోనే స్వదేశానికి తిరిగి వస్తామని తెలిపింది.
టీ20 ప్రపంచకప్ కోసం కఠిన సాధన చేసినట్లు చెప్పుకొచ్చింది. ముఖ్యంగా ఫీల్డింగ్, ఫిట్‌నెస్ పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వెల్లడించింది. గత పొరపాట్లను సరిదిద్దుకుని ఈ సారి విజేతగా తిరిగివస్తామన్న ధీమాను వ్యక్తం చేసింది. అత్యుత్తమ జట్టుతో బరిలోకి దిగుతున్నామని, ఏ జట్టునైనా ఓడిస్తామంది. ఈ విషయం ఆస్ట్రేలియాకు సైతం తెలుసునని చెప్పింది.
ICC rankings : బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో విఫలం.. పడిపోయిన రోహిత్, కోహ్లీ ర్యాంకులు..
టీ20 ప్రపంచకప్ టోర్నీలలో ఇప్పటి వరకు భారత మహిళల జట్టు ఒక్కసారి మాత్రమే ఫైనల్ చేరుకుంది. 2020 ఎడిషన్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి తృటిలో కప్పును చేజార్చుకుంది. ఇక ఈ ఏడాది జూలైలో ఆసియా కప్ ఫైనల్ మ్యాచులో శ్రీలంక చేతిలో ఓడిపోయి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది భారత్. ఈ మ్యాచ్ తరువాత మరో మ్యాచ్ ఆడలేదు. నేరుగా టీ20 ప్రపంచకప్‌లోనే బరిలోకి దిగుతోంది.
మొత్తం 10 జట్లు పాల్గొంటుండగా.. అయిదు జట్లు చొప్పున రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూపు ఏలో భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక ఉండగా.. గ్రూప్-బిలో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ లు ఉన్నాయి. ఇక భారత జట్టు తన మొదటి మ్యాచ్‌ను అక్టోబర్ 4 న న్యూజిలాండ్‌తో ఆడనుంది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ అక్టోబర్ 6 జరగనుంది. ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 20న జరగనుంది.
Najmul Hossain : భారత్ పై ఓటమి.. బంగ్లాదేశ్ కెప్టెన్ కామెంట్స్.. మేం ఓడిపోయినా..
💬💬 The preparation has been fantastic.
Hear what #TeamIndia Head Coach Amol Muzumdar had to say ahead of the upcoming #T20WorldCup in UAE👌👌 pic.twitter.com/AfETLo0GoA
— BCCI Women (@BCCIWomen) September 24, 2024