Pakistan Defeat: పాకిస్తాన్ ఘోర పరాజయం.. హ్యాట్రిక్ ఓటమి నమోదు..

మరో ఎండ్ లో వికెట్లు పడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో 36.3 ఓవర్లలో 114 పరుగులకే పాక్ ఆలౌట్ అయ్యింది.

Pakistan Defeat: పాకిస్తాన్ ఘోర పరాజయం.. హ్యాట్రిక్ ఓటమి నమోదు..

Courtesy @ EspnCricInfo

Updated On : October 9, 2025 / 12:10 AM IST

Pakistan Defeat: ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ లో పాకిస్తాన్ పరాజయాల పరంపర కంటిన్యూ అవుతోంది. వరుసగా మూడో ఓటమి చవి చూసింది. పాక్ మరోసారి ఘోర పరాజయం పాలైంది. ఏకంగా 107 పరుగుల తేడాతో చిత్తు చిత్తుగా ఓడింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో పాక్ కు పరాభవం ఎదురైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 9 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. 222 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన పాక్ జట్టు ఏ దశలోనూ గెలిచేలా కనిపించలేదు. సిద్రా అమీన్ (35) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ పరుగులు చేయలేదు. మరో ఎండ్ లో వికెట్లు పడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో 36.3 ఓవర్లలో 114 పరుగులకే పాక్ ఆలౌట్ అయ్యింది. 107 పరుగుల తేడాతో ఓటమి చూసింది. ఆసీస్ బౌలర్లలో గార్త్ 3 వికెట్లతో రాణించింది.

ఈ టోర్నీలో ఆడిన 3 మ్యాచుల్లోనూ పాక్ ఓడింది. పాయింట్ల టేబుల్‌లో చివరి స్థానంలో ఉంది. తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ చేతిలో, రెండో మ్యాచ్ లో భారత్ చేతిలో పాక్ ఓడింది. తాజాగా ఆసీస్ చేతిలోనూ ఓటమిపాలైంది.