×
Ad

Womens World Cup 2025 : మ‌హిళ‌ల వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త్ సెమీస్ అవ‌కాశాలు ఇలా..

మ‌హిళ‌ల వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ 2025లో (Womens World Cup 2025) భార‌త సెమీస్ అవ‌కాశాలు ఇలా ఉన్నాయి.

Womens World Cup 2025 India Women Semis race scenario

Womens World Cup 2025 : మ‌హిళ‌ల వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2025లో మ్యాచ్‌లు ఆస‌క్తిక‌రంగా సాగుతున్నాయి. ఆస్ట్రేలియా, ద‌క్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ జ‌ట్లు సెమీస్ బెర్తుల‌ను ఖాయం చేసుకున్నాయి. ఇక మిగిలిన ఒక్క స్థానం కోసం తీవ్ర పోటీ నెల‌కొంది. వ‌రుస‌గా మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోవ‌డంతో భార‌త్ సెమీస్ అవ‌కాశాలు క్లిష్టం అయ్యాయి.

భార‌త్ ఇప్ప‌టి వ‌ర‌కు ఈ టోర్నీలో 5 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో రెండు మ్యాచ్‌ల్లో గెలిచింది. మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. భార‌త్ ఖాతాలో నాలుగు పాయింట్లు ఉండ‌గా నెట్‌ర‌న్‌రేట్ +0.526గా ఉంది. ప్ర‌స్తుతం పాయింట్ల ప‌ట్టిక‌లో నాలుగో స్థానంలో ఉంది.

Rishabh Pant : కెప్టెన్‌గా రిష‌బ్ పంత్‌.. ద‌క్షిణాఫ్రికాతో-ఏతో టెస్టు సిరీస్‌కు భార‌త-ఏ జ‌ట్టు ఎంపిక‌

ఈ టోర్నీలో (Womens World Cup 2025) భార‌త్ మ‌రో రెండు మ్యాచ్‌లు.. న్యూజిలాండ్‌తో అక్టోబ‌ర్ 23న‌, బంగ్లాదేశ్‌తో అక్టోబ‌ర్ 26న ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ టీమ్ఇండియా గెలిస్తే.. ఎలాంటి స‌మీక‌ర‌ణాల‌తో సంబంధం లేకుండా భార‌త్ సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంటుంది.

ఒక్క మ్యాచ్‌లో విజ‌యం సాధిస్తే..

టీమ్ఇండియా ఓ మ్యాచ్‌లో గెలిచి, మ‌రో మ్యాచ్‌లో ఓడిపోయిన‌ప్ప‌టికి కూడా సెమీస్ చేరుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. అయితే.. అది ఇత‌ర జ‌ట్ల ఫ‌లితాల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. మిగిలిన జ‌ట్ల కంటే మెరుగైన ర‌న్‌రేట్ క‌లిగి ఉంటే భార‌త్ ముందంజ వేస్తుంది. ఒక వేళ రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోతే మాత్రం సెమీస్ రేసు నుంచి దాదాపుగా నిష్ర్క‌మించిన‌ట్లే.

IND vs AUS : ఇదేం కెప్టెన్సీ.. శుభ్‌మ‌న్ గిల్ పై కైఫ్ విమ‌ర్శ‌లు..

రేసులో ఎవ‌రెవ‌రు ఉన్నారంటే..

పాయింట్ల ప‌ట్టిక‌లో చివ‌రి స్థానాల్లో ఉన్న బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌లు దాదాపుగా సెమీస్ రేసు నుంచి నిష్ర్క‌మించిన‌ట్లే. శ్రీలంక‌, న్యూజిలాండ్‌, భార‌త్ జ‌ట్ల మ‌ధ్యే నాలుగో బెర్తు కోసం పోటీ నెల‌కొంది.