Womens World Cup 2025 Today match between India Women vs New Zealand Women
Womens World Cup 2025 : మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భారత్ తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి జోరు మీద కనిపించింది. ఆ తరువాతే కథ అడ్డం తిరిగింది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ప్రస్తుతం భారత్ ఖాతాలో నాలుగు పాయింట్లు ఉన్నాయి. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది.
ఈ టోర్నీలో (Womens World Cup 2025) ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాలు ఇప్పటికే సెమీస్ బెర్తును ఖాయం చేసుకున్నాయి. మిగిలిన ఒక్క స్థానం కోసం భారత్, న్యూజిలాండ్, శ్రీలంక జట్లు పోటీపడుతున్నాయి. ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా టీమ్ఇండియా సెమీస్ చేరాలంటే చివరి రెండు మ్యాచ్‌ల్లో గెలవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో నేడు (గురువారం అక్టోబర్ 23) న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. కివీస్ పై విజయం సాధించినా కూడా భారత్ సెమీస్ చేరుకునే అవకాశాలు ఉన్నాయి.
Virat Kohli : ఆసీస్‌తో రెండో వన్డే.. భారీ రికార్డులపై విరాట్ కోహ్లీ కన్ను..
మరోవైపు న్యూజిలాండ్ ఖాతాలోనూ 4 పాయింట్లు ఉన్నాయి. భారత్ కంటే నెట్‌రన్‌రేట్ (-0.245) తక్కువగా ఉండడంతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. భారత్ పై విజయం సాధించి సెమీస్ అవకాశాలను మెరుగుపరచుకోవాలని కివీస్ ఆరాటపడుతోంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశాలు ఉన్నాయి.
హెడ్-టు-హెడ్ రికార్డు..
భారత్ వేదికగా న్యూజిలాండ్, టీమ్ఇండియా జట్లు వన్డేల్లో 23 మ్యాచ్‌ల్లో ముఖాముఖిగా తలపడ్డాయి. ఇందులో టీమ్ఇండియా 12 మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్ 10 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ఒక ఓవరాల్‌గా చూసుకుంటే 57 మ్యాచ్‌ల్లో భారత్, కివీస్ ముఖాముఖిగా తలపడ్డాయి. ఇందులో భారత్ 22 మ్యాచ్‌ల్లో గెలవగా, న్యూజిలాండ్ 34 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.
ఇక ఈ రెండు జట్ల మధ్య జరిగిన చివరి ఐదు మ్యాచ్‌ల్లో భారత్ మూడు, కివీస్ రెండు మ్యాచ్‌ల్లో గెలుపొందాయి.
IND vs AUS : ఆసీస్‌తో రెండో వన్డే.. అడిలైడ్‌లో రోహిత్ రికార్డు అలా, కోహ్లీ రికార్డు ఇలా..
బౌలింగ్ మెరుగుపడేనా?
కివీస్‌తో కీలక పోరులో భారత్ విజయం సాధించాలంటే.. బౌలింగ్ విభాగం మెరుగుపడాల్సిన అవసరం ఉంది. ఆసీస్‌తో మ్యాచ్‌లో 331 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించినప్పటికి కూడా బౌలర్లు కాపాడలేకపోయారు. క్రాంతిగౌడ్, స్నేహ్ రాణా గత రెండు మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయారు. ఇక ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో ఆడిన పేసర్ రేణుకా సింగ్ తక్కువ పరుగులే ఇచ్చినప్పటికీ వికెట్లను సాధించలేకపోయింది.