ఒక్క అడుగు : ప్రపంచ ఛాంపియన్స్ ఫైనల్లో సింధు

  • Published By: madhu ,Published On : August 25, 2019 / 02:14 AM IST
ఒక్క అడుగు : ప్రపంచ ఛాంపియన్స్ ఫైనల్లో సింధు

Updated On : May 28, 2020 / 3:43 PM IST

బ్యాడ్మింటన్ ఛాంపియన్‌లో భారత స్టార్ బ్యాడ్మింటన్ పీవీ సింధు టైటిల్‌కు ఒక్క అడుగుదూరంలో నిలిచింది. సెమీస్‌లో చైనా క్రీడాకారిణి చెన్ యూఫీతో తలపడిన సింధు 21-7, 21-14 తేడాతో ఘనవిజయం సాధించింది. కేవలం 40 నిమిషాల్లోనే ఆటను పూర్తి చేసిన సింధు.. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌లో వరుసగా మూడో‌సారి ఫైనల్‌కు చేరిన మొదటి భారత క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. 

పీవీ సింధు ఈ ఏడాది ఒక్క టైటిల్ సాధించలేకపోయింది. ఇండోనేషియా ఓపెన్ ఫైనల్స్‌కు చేరినా..అక్కడ నిరాశే ఎదురైంది. పట్టుదలతో పోరాడుతున్న సింధు.. ఈ టోర్నీ క్వార్టర్ ఫైనల్లో తైజు యింగ్ ని ఓడించి.. ఆగస్టు 24వ తేదీ శనివారం జరిగిన సెమీఫైనల్లో ఏకపక్ష విజయం నమోదు చేసింది.

పసిడిపోరులో సింధుతో..ఒకుహర తలపడనుంది. ఫైనల్ ఫోబియా నుంచి బయటపడి ఈ సారి టైటిల్ గెలుస్తుందా. ఎప్పటిలాగే ఫైనల్ నుంచి వెనుదిరుగుతుందాననేది చూడాలి. 

మరోవైపు భారత్‌ షట్లర్‌ సాయిప్రణీత్ జపాన్‌కి చెందిన నంబర్‌వన్‌ షట్లర్ కెంటోను సెమీస్‌లో ఢీ కొన్న ప్రణీత్ పరాజయాన్ని చవిచూశాడు. దీంతో సెమీస్‌లో నిష్క్రమించిన సాయి ప్రణీత్‌కు కాంస్యం మాత్రమే దక్కింది.
Read More : బరిలో కోహ్లీ.. సపోర్ట్‌గా రహానె