బరిలో కోహ్లీ.. సపోర్ట్‌గా రహానె

వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 222పరుగులకే కట్టడి చేసిన భారత్.. రెండో ఇన్నింగ్స్‌లో ఆచితూచి ఆడుతోంది. ఇషాంత్‌శర్మ (5/43), షమి(2/48), జడేజా(2/64) విజృంభించడంతో విండీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 222 పరుగులకు ఆలౌట్ చేసి భారత్ 75 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది.
ఓపెనర్లు కేఎల్ రాహుల్(38), మయాంక్ అగర్వాల్(16) పరవాలేదనిపిస్తూ క్రీజులో కుదురుకున్నారు. ఈ మేర 13.2ఓవర్ల వద్ద భాగస్వామ్యానికి బ్రేక్‌లు పడగా, రెండో వికెట్‌గా 29.2ఓవర్లకు 73పరుగుల వద్ద రాహుల్ పెవిలియన్ చేరాడు. పూజారా పాతిక పరుగులతో సరిపెట్టుకోవడంతో నెం.4లో వచ్చిన విరాట్ కోహ్లీ(51), అజింకా రహానె(53) విండీస్ సహనాన్ని పరీక్షిస్తున్నారు.
68వ ఓవర్‌లో రహానె హాఫ్ సెంచరీ అందుకోగా.. 71వ ఓవర్‌లో కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే శతక పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి మూడో రోజు ఆటలో అజేయంగా నిలిచారు. భారత్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 72 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. క్రీజులో కోహ్లీ, రహానెలు పోరాడుతున్నారు.