AUS vs SL : ఎట్ట‌కేల‌కు ప్ర‌పంచ‌క‌ప్‌లో ఆస్ట్రేలియా బోణీ.. శ్రీలంక పై ఘ‌న విజ‌యం

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో ఎట్ట‌కేల‌కు ఆస్ట్రేలియా బోణీ కొట్టింది. లక్నో వేదిక‌గా శ్రీలంక‌తో జ‌రిగిన మ్యాచులో 5 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది.

AUS vs SL : ఎట్ట‌కేల‌కు ప్ర‌పంచ‌క‌ప్‌లో ఆస్ట్రేలియా బోణీ.. శ్రీలంక పై ఘ‌న విజ‌యం

Australia beat Sri Lanka

World Cup 2023 AUS vs SL : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో ఎట్ట‌కేల‌కు ఆస్ట్రేలియా బోణీ కొట్టింది. వ‌రుస‌గా భార‌త్‌, దక్షిణాఫ్రికా చేతుల్లో ఓడిన ఆసీస్.. లక్నో వేదిక‌గా శ్రీలంక‌తో జ‌రిగిన మ్యాచులో 5 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. 210 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 35.2 ఓవ‌ర్ల‌లో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆసీస్ బ్యాట‌ర్ల‌లో మిచెల్ మార్ష్ (52; 51 బంతుల్లో 9 ఫోర్లు), జోష్ ఇంగ్లిస్ (58; 59 బంతుల్లో 5 ఫోర్లు, 1సిక్స్‌) హాఫ్ సెంచ‌రీలు చేశారు. మార్న‌స్ ల‌బుషేన్ (40), మాక్స్‌వెల్ (31 నాటౌట్‌)లు రాణించారు. శ్రీలంక బౌల‌ర్ల‌లో మధుశంక మూడు వికెట్లు తీశాడు. దునిత్ వెల్లలాగే ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.

Suryakumar Yadav : డ‌గౌట్‌లో తిన్నందుకు ట్రోలింగ్‌.. సూర్యకుమార్ యాద‌వ్ రిప్లై అదుర్స్‌.. ‘నాకు ఆర్డ‌ర్ ఇవ్వ‌కు..’

అంత‌క ముందు మొద‌ట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 43.3 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. లంక బ్యాట‌ర్ల‌లో ఓపెన‌ర్లు పాతుమ్ నిస్సాంక (61; 67 బంతుల్లో 8 ఫోర్లు), కుశాల్ పెరీరా(78; 82 బంతుల్లో 12 ఫోర్లు) లు హాఫ్ సెంచ‌రీల‌తో రాణించారు. వీరిద్ద‌రు మొద‌టి వికెట్‌కు 125 ప‌రుగులు జోడించి శుభారంభం అందించారు. అయితే.. మిగిలిన వారిలో చ‌రిత్ అస‌లంక (25) ఫ‌ర్వాలేద‌నిపించాడు. కెప్టెన్ కుశాల్ మెండిస్ (9), స‌దీర స‌మ‌ర‌విక్ర‌మ (8), ధ‌నుజంయ డిసిల్వా (7), క‌రుణ‌ర‌త్నే (2) లు విఫ‌లం కావ‌డంతో శ్రీలంక ఓ మోస్త‌రు స్కోరుకే ప‌రిమిత‌మైంది. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా 4 వికెట్లు తీశాడు. స్టార్క్, కమిన్స్ రెండేసి వికెట్లు ప‌డ‌గొట్టారు. గ్లెన్ మాక్స్‌వెల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.