PAK vs BAN : మిణుకు మిణుకుమంటున్న పాకిస్థాన్ సెమీస్ ఆశలు.. బంగ్లాదేశ్ పై భారీ విజయం
వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరేందుకు మిణుకుమిణుకు మంటున్న ఆశలను సజీవంగా ఉంచుకునేందుకు పాకిస్థాన్ తన వంతు ప్రయత్నం చేస్తోంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారీ విజయాన్ని నమోదు చేసింది.

Pakistan
Pakistan vs Bangladesh : వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరేందుకు మిణుకుమిణుకు మంటున్న ఆశలను సజీవంగా ఉంచుకునేందుకు పాకిస్థాన్ తన వంతు ప్రయత్నం చేస్తోంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారీ విజయాన్ని నమోదు చేసింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ మరో 17.3 ఓవర్లు మిగిలి ఉండగా 32.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి గెలుపొందింది. తద్వారా తన నెట్ రన్‌రేట్‌ను గణనీయంగా పెంచుకుంది.
పాకిస్థాన్ బ్యాటర్లలో ఫఖర్ జమాన్ (81; 74 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లు), అబ్దుల్లా షఫీక్ (68; 69 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్థశతకాలతో రాణించారు. బాబర్ ఆజామ్ (9) విఫలమైనా ఇఫ్తికార్ అహ్మద్ అహ్మద్(17 నాటౌట్)తో కలిసి మహ్మద్ రిజ్వాన్ (26 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహిదీ హసన్ మిరాజ్ మూడు వికెట్లు తీశాడు.
అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 45.1 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌటైంది. మహ్మదుల్లా(56; 70 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్) హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. లిట్టన్ దాస్ (45) షకీబ్ అల్ హసన్ (43), మెహిదీ హసన్ మిరాజ్(25) రాణించారు. మిగతా ఆటగాళ్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితం కావడంతో బంగ్లా భారీ స్కోరు చేయలేకపోయింది. పాకిస్థాన్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది, మహ్మద్ వాసిం జూనియర్ మూడేసి వికెట్లు తీశారు. హరీస్ రవూఫ్ రెండు వికెట్లు తీశాడు. ఇఫ్తికార్ అహ్మద్, ఉసామా మీర్ చెరో వికెట్ సాధించారు.
Pakistan win by seven wickets and 105 balls to spare! ?@iMRizwanPak and @IftiMania give the finishing touches after brilliant knocks by the openers ?#PAKvBAN | #CWC23 | #DattKePakistani pic.twitter.com/qmKwP26G8H
— Pakistan Cricket (@TheRealPCB) October 31, 2023