Shaheen Afridi
World Cup 2023 IND vs PAK ODI : వన్డే ప్రపంచకప్‌లో హై ఓల్టేజీ సమరానికి సమయం దగ్గర పడింది. శనివారం అక్టోబర్ 14న అహ్మదాబాద్ వేదికగా భారత్, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రెండు జట్లు అహ్మదాబాద్ చేరుకుని తీవ్రంగా సాధన చేస్తున్నాయి. ప్రత్యర్థిని చిత్తు చేసేందుకు వ్యూహా, ప్రతి వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి.
వన్డే ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు భారత్, పాకిస్తాన్ జట్లు ఏడు సార్లు తలపడ్డాయి. ఈ ఏడు సందర్భాల్లో విజయం భారత్‌నే వరించింది. ఈ నేపథ్యంలో శనివారం మ్యాచ్‌లో కూడా గెలిచి విజయపరంపర కొనసాగించాలని భారత జట్టు భావిస్తోండగా.. పరాజయాల పరంపరకు బ్రేక్ వేయాలని పాకిస్తాన్ గట్టి పట్టుదలతో ఉంది. ఈ క్రమంలో ఆ జట్టు ఆటగాళ్లు మైదానంలో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నారు.
తీవ్రమైన సాధన..
కెప్టెన్ బాబర్ ఆజం, హరీస్ రవూఫ్, షాదాబ్ ఖాన్, అబ్దుల్లా షఫీక్, ఇఫ్తికర్ అహ్మద్, హసన్ అలీ వంటి కీలక ఆటగాళ్లు ఫీల్డింగ్ కోచ్ అఫ్తాబ్ ఖాన్ పర్యవేక్షణలో ఫీల్డింగ్ ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. ఖచ్చిమైన త్రోలను వేయడంతో పాటు క్యాచ్‌లను ప్రాక్టీస్ చేసింది. బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ నేతృత్వంలో మహమ్మద్ నవాజ్, ఇఫ్తికార్ అహ్మద్, అఘా సల్మాన్‌లు తమ స్పిన్ బౌలింగ్ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడంపై దృష్టి సారించారు. ఇదే ప్రాక్టీస్ సెషన్ లో స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది సైతం పాల్గొన్నాడు.
IND vs PAK : బాయ్‌కాట్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్.. జవాన్ల ప్రాణాలు పోతుంటే..?
తన బౌలింగ్, ఫీల్డింగ్ కసరత్తుల తరువాత మైదానం బయటకు వెళ్లేందుకు సిద్ధం అయ్యాడు. బౌండరీ లైన్ వద్ద అభిమానులు అతడితో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. షాహీన్ వారితో మాట్లాడుతూ ఇలా ఉన్నాడు. ‘నేను ఖచ్చితం సెల్ఫీలు ఇస్తాను. కానీ ఇప్పుడు కాదు.. భారత్‌పై 5 వికెట్లు తీసిన తరువాతనే ఆ పని చేస్తా.’ అంటూ చెప్పాడు. అతడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఇది ఓ రకంగా భారత బ్యాటర్లు వార్నింగ్ లాంటిదే అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.