Cricket Jersey: ఐపీఎల్‌ ఫైనల్ వేడుకలో అతిపెద్ద జెర్సీ లాంచ్

ఐపీఎల్ 2022 ఫైనల్ సెలబ్రేషన్స్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో క్రికెట్ అభిమానులకు అసాధారణమైన ఆశ్చర్యంతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ జెర్సీని ఆవిష్కరించారు. దీని పేరిట గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నమోదైంది.

Cricket Jersey: ఐపీఎల్‌ ఫైనల్ వేడుకలో అతిపెద్ద జెర్సీ లాంచ్

Ravi Shatri

Cricket Jersey: ఐపీఎల్ 2022 ఫైనల్ సెలబ్రేషన్స్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో క్రికెట్ అభిమానులకు అసాధారణమైన ఆశ్చర్యంతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ జెర్సీని ఆవిష్కరించారు. దీని పేరిట గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నమోదైంది.

IPL 2022 ఫైనల్ సీజన్‌లో అరంగేట్ర ఫ్రాంచైజీ గుజరాత్ లయన్స్, సీజన్ వన్ విన్నర్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మొదలైంది. ఈ అద్భుతమైన వేడుకలో బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ స్పెషల్ పర్‌ఫార్మెన్స్ ఇచ్చారు. మ్యూజిక్ మ్యాస్ట్రో ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ కూడా ప్రత్యేక ప్రదర్శన చేశారు.

“మీకో అద్భుతాన్ని చూపిస్తా. నా వెనుక అతిపెద్ద జెర్సీని మిస్ అవలేదని ఖచ్చితంగా అనుకుంటున్నా. ప్రతి ఒక్కరూ IPL చరిత్రలో ఈ క్షణాన్ని మర్చిపోలేరు. ఐపీఎల్ తన 15వ సీజన్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ జెర్సీని రూపొందించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను బ్రేక్ చేసింది. అద్భుతమైన జెర్సీ 66 మీటర్లు ఉంది” అని భారత మాజీ కోచ్ రవిశాస్త్రి ప్రేక్షకులతో అన్నారు.

Read Also: ఐపీఎల్‌ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి అమిత్ షా