Yuzvendra Chahal: చాహల్ పేరెంట్స్‌కు కరోనా పాజిటివ్ .. తీవ్ర లక్షణాలతో హాస్పిటల్‌లో చేరిక

టీమిండియా క్రికెటర్.. స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ పేరెంట్స్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. చాహల్ భార్య ధనశ్రీ ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది. అతని తండ్రికి తీవ్రమైన లక్షణాలు కనిపిస్తుండటంతో...

Yuzvendra Chahal: చాహల్ పేరెంట్స్‌కు కరోనా పాజిటివ్ .. తీవ్ర లక్షణాలతో హాస్పిటల్‌లో చేరిక

Yuzvendra Chahals Parents Test Positive For Covid 19 Father Admitted To Hospital With Severe Symptoms

Updated On : May 13, 2021 / 5:32 PM IST

Yuzvendra Chahal: టీమిండియా క్రికెటర్.. స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ పేరెంట్స్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. చాహల్ భార్య ధనశ్రీ ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది. అతని తండ్రికి తీవ్రమైన లక్షణాలు కనిపిస్తుండటంతో హాస్పిటల్ లో చేర్పించారు.

ఏప్రిల్-మే రోజులు మరింత టఫ్ గా ఛాలెంజింగ్ గా ఉండనున్నాయి. ముందుగా మా అమ్మ-అన్నకు పాజిటివ్ వచ్చింది. అప్పుడు నేను ఐపీఎల్ బయో బబుల్ లో ఉన్నా. సాయం చేయలేని పరిస్థితుల్లో ఉండిపోయా. ఇప్పుడు వాళ్లని టైం టూ టైం మానిటర్ చేసుకోగలను. కుటుంబానికి దూరంగా ఉండటం చాలా కష్టం. అదృష్టవశాత్తు వాళ్ల రికవరీ అయ్యారు. కానీ, మా అంకుల్, ఆంటీ చనిపోయారంటూ రాసుకొచ్చింది చాహల్ భార్య.

ఇప్పుడు మా అత్తామామలకు పలు లక్షణాలతో పాజిటివ్ వచ్చింది. మా మామయ్యను హాస్పిటల్ లో జాయిన్ చేశాం. నేను హాస్పిటల్ లోనే ఉంటున్నా. అన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నా. వీలైనంత వరకూ మీరు కూడా ఇంట్లోనే ఉండండి’ అని పోస్టు చేసింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 రద్దు తర్వాత చాహల్ రీసెంట్ గా ఇంటికి చేరుకున్నాడు. ముందుగా ఆర్సీబీ, కోల్ కతా మ్యాచ్ ను వాయిదా వేసిన బీసీసీఐ.. ఎట్టకేలకు టోర్నమెంట్ నే రద్దు చేసింది. ఎలాగూ టెస్టు స్క్వాడ్ లో లేని చాహల్.. ఇంటి పట్టునే ఉండనున్నాడు.

కొద్ది నెలలు ఇంటి దగ్గరే ఉండి తర్వాత శ్రీలంకతో జరగనున్న మూడు వన్డేలు, టీ20ల కోసం బయల్దేరనున్నాడు చాహల్.