Wiaan Mulder : వీడెవడండీ బాబు.. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే సన్‌రైజర్స్ ఆల్‌రౌండర్ ట్రిపుల్ సెంచరీ.. బ్రియాన్ లారా ప్రపంచ రికార్డును వద్దనుకున్నాడు..
దక్షిణాఫ్రికా తాత్కాలిక కెప్టెన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌రౌండర్ వియాన్ మల్డర్ అరుదైన ఘనత సాధించాడు.

ZIM vs SA 2nd test Wiaan Mulder Breaks Silence On Why He Did Not Go For Brian Lara 400
దక్షిణాఫ్రికా తాత్కాలిక కెప్టెన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌రౌండర్ వియాన్ మల్డర్ అరుదైన ఘనత సాధించాడు. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే ట్రిపుల్ సెంచరీ చేసిన ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. బులవాయో వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో అతడు ఈ ఘనత సాధించాడు. అయితే.. విండీస్ దిగ్గజ ఆటగాడు బ్రియాన్ లారా పేరిట ఉన్న 400 పరుగుల రికార్డును బ్రేక్ చేసే అవకాశాన్ని కావాలని వద్దు అని అనుకున్నాడు.
రెండో టెస్ట్‌లో వియాన్ మల్డర్ 297 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ చేశాడు. టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా ట్రిపుల్ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. 278 బంతుల్లోనే ట్రిపుల్ సెంచరీ చేసి ఈ జాబితాలో సెహ్వాగ్ అగ్రస్థానంలో ఉన్నాడు.
టెస్టుల్లో అత్యంత వేగంగా ట్రిపుల్ సెంచరీ చేసిన ఆటగాళ్లు వీరే..
వీరేంద్ర సెహ్వాగ్ (భారత్) – 278 బంతుల్లో
వియాన్ మల్డర్ (దక్షిణాఫ్రికా) – 297 బంతుల్లో
హ్యారీ బ్రూక్ (ఇంగ్లాండ్) – 310 బంతుల్లో
మాథ్యూ హెడెన్ (ఆస్ట్రేలియా) – 362 బంతుల్లో
వీరేంద్ర సెహ్వాగ్ (భారత్) – 364 బంతుల్లో
ఈ మ్యాచ్‌లో వియాన్ ముల్డర్ 334 బంతులను ఎదుర్కొన్నాడు 49 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 367 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో పలు రికార్డులు నెలకొల్పాడు. దక్షిణాఫ్రికా తరుపున టెస్టుల్లో ఓ మ్యాచ్‌లో అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో హషీమ్ ఆమ్లా (331) రికార్డును బ్రేక్ చేశాడు. ఇక విదేశీ గడ్డపై అత్యధిక టెస్ట్ స్కోర్ చేసిన ఆటగాడిగానూ నిలిచాడు. టెస్ట్ క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ బాదిన అతి పిన్న వయస్కుడిగానూ నిలిచాడు. అతను 27 ఏళ్ల 138 రోజుల వయసులోనే ఈ ఫీట్ సాధించాడు.
Shubman Gill : శుభ్‌మన్ గిల్ ఎంత పని చేశావయ్యా.. నీ ఒక్కడి వల్ల బీసీసీఐకి రూ.250 కోట్ల నష్టం?
లారా రికార్డును వద్దనుకున్నాడు..
టెస్టు క్రికెట్‌లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా (400 నాటౌట్) పేరిట ఉంది. వియాన్ ముల్డర్ మరికొన్ని ఓవర్లు ఆడితే ఈజీగా లారా రికార్డును బ్రేక్ చేసే వాడు. కానీ అతడు మాత్రం దాన్ని వద్దనుకున్నాడు. లంచ్ విరామనికి 367 పరుగుల వ్యక్తిగత స్కోరుతో వెళ్లిన అతడు మళ్లీ బ్యాటింగ్‌కు రాలేదు. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ను 626/5 స్కోరు వద్ద డిక్లర్ చేశాడు.
ఇక రెండో రోజు మ్యాచ్ అనంతరం బ్రియాన్ లారా రికార్డు గురించి మాట్లాడాడు. టెస్టుల్లో అత్యధిక స్కోరు లారా లాంటి గొప్ప బ్యాటర్ పేరు మీదే ఉండాలన్నాడు. తన కెరీర్‌లో మరోసారి ఇలాంటి అవకాశం వచ్చినా కూడా ఆ రికార్డును దాటే ప్రయత్నం చేయనని చెప్పుకొచ్చాడు.
Virender Sehwag : అయ్యో పాపం సెహ్వాగ్.. విచిత్ర పరిస్థితి.. ఓ కుమారుడు అలా, మరో కుమారుడు ఇలా..
MULDER TALKS ABOUT HIS DECLARATION:
“Lara’s Record is exactly where it Should be”. pic.twitter.com/PWwKGlvoL6
— Johns. (@CricCrazyJohns) July 7, 2025
ఐపీఎల్ 2025 సీజన్‌లో అతడు సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున ఆడాడు. ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బ్రైడన్ కార్స్ గాయపడటంతో అతని స్థానాన్ని వియాన్ మల్డర్‌తో భర్తీ చేసింది. అతడు ఒకే ఒక మ్యాచ్ ఆడాడు. కాగా.. ట్రిపుల్ సెంచరీ చేసిన వియాన్ ముల్టర్‌కు ఎస్ఆర్‌హెచ్ సోషల్ మీడియా వేదికగా అభినందలు తెలియజేసింది.
టెస్టుల్లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే..
బ్రియాన్ లారా (వెస్టిండీస్) – 400* ( 2004లో ఇంగ్లాండ్‌పై)
మాథ్యూ హేడెన్ (ఆస్ట్రేలియా) – 380 (2003లో జింబాబ్వేపై)
బ్రియాన్ లారా (వెస్టిండీస్) – 375 (1994లో ఇంగ్లాండ్‌పై)
మహేల జయవర్దెనె (శ్రీలంక) – 374 (2006లో దక్షిణాఫ్రికాపై)
వియాన్ ముల్డర్ (దక్షిణాఫ్రికా) – 367* ( 2025లో జింబాబ్వేపై)