Zim vs Ind: జింబాబ్వేపై భారత్ ఘన విజయం

టీమిండియా బ్యాటర్లు అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్ అద్భుతంగా ఆడడంతో..

Zim vs Ind: జింబాబ్వేపై భారత్ ఘన విజయం

Pic Credit: @BCCI Twitter

జింబాబ్వే చేతిలో మొదటి టీ20లో ఓడిపోయిన టీమిండియా రెండో టీ20లో 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. జింబాబ్వే అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ రాణించలేకపోయింది.

జింబాబ్వే బ్యాటర్లలో మాధెవెరె 43, బ్రియాన్ 26, ల్యూక్ 33 పరుగులు మినహా మిగతా ఆటగాళ్లు చెప్పుకోదగ్గ పరుగులు చేయలేదు. దీంతో ఆ జట్టు 18.4 ఓవర్లకు 134 పరుగులకే ఆలౌట్ అయింది. టీమిండియా బౌలర్లలో ముకేశ్ కుమార్, అవేశ్ ఖాన్ మూడేసి వికెట్లు తీయగా, రవి బిష్ణోయి 2, వాషింగ్టన్ సుందర్ ఓ వికెట్ తీశాడు.

బింబాబ్వే టార్గెట్ 235
టీమిండియా బ్యాటర్లు అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్ అద్భుతంగా ఆడడంతో జింజాబ్వే ముందు భారత్ 235 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. టీమిండియా బ్యాటర్లలో శుభ్‌మన్ గిల్ 2, అభిషేక్ శర్మ 100, రుతురాజ్ గైక్వాడ్ 77, రింకూ సింగ్ 48 పరుగులు బాదారు. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 234-2 పరుగులు చేసింది. జింబాబ్వే బౌలర్లలో ముజరబానీ, వెల్లింగ్టన్ తలో వికెట్ పడగొట్టారు.

శుభ్‌మన్ గిల్ 2 పరుగులకే ఔట్
జింబాబ్వే, భారత్ మధ్య రెండో టీ20 మ్యాచ్ జరుగుతోంది. హరారే స్పోర్ట్స్ క్లబ్ లో జరుగుతున్న ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఇండియా మొదట బ్యాటింగ్ తీసుకుంది. శుభ్‌మన్ గిల్ 2 పరుగులకే ఔటయ్యాడు. అభిషేక్ శర్మ సెంచరీతో అదరగొట్టాడు. అనంతరం ఔట్ అయ్యాడు. రుతురాజ్ గైక్వాడ్, రింకూ సింగ్ చక్కని షాట్లు ఆడారు.

భారత జట్టు
శుభ్‌మన్ గిల్(కెప్టెన్), అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, రియాన్ పరాగ్, రింకూ సింగ్, ధ్రువ్ జురెల్(కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్

జింబాబ్వే జట్టు
వెస్లీ మాధేవెరే, ఇన్నోసెంట్ కైయా, బ్రియాన్ బెన్నెట్, సికందర్ రజా(కెప్టెన్), డియోన్ మైయర్స్, జోనాథన్ కాంప్‌బెల్, క్లైవ్ మదాండే(వికెట్ కీపర్), వెల్లింగ్టన్ మసకద్జా, ల్యూక్ జోంగ్వే, బ్లెస్సింగ్ ముజరబానీ, టెండై చతారా

ధోనీ పుట్టినరోజు వేడుకల్లో భార్య సాక్షి ఏం చేసిందో చూశారా.. వీడియో వైరల్