Mercedes-Benz AMG : భారత్‌కు మెర్సిడెస్ బెంజ్ ఎఎంజీ G63 వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?

Mercedes-Benz AMG : లాంచ్‌కు ముందే వెహికల్ 120కిపైగా బుకింగ్‌లను పొందినట్లు అధికారికంగా వెల్లడించింది. ఇప్పుడు కంపెనీ క్యూ3 2025 కోసం ముందుగానే బుకింగ్‌లను ప్రారంభించింది. 

Mercedes-Benz AMG : భారత్‌కు మెర్సిడెస్ బెంజ్ ఎఎంజీ G63 వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?

2024-2025 Mercedes-Benz AMG G 63 Arrived in India

Updated On : October 22, 2024 / 11:23 PM IST

Mercedes-Benz AMG : ప్రముఖ జర్మన్ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్ భారతీయ కస్టమర్ల కోసం ఎఎంజీ జీ63 లేటెస్ట్ మోడల్‌తో వచ్చింది. ఆటోమొబైల్ దిగ్గజం 2024-25 మెర్సిడెస్-బెంజ్ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ. 3.6 కోట్లతో (ఎక్స్-షోరూమ్) లాంచ్ అయింది. 31 ప్రత్యేకమైన అప్హోల్స్టరీ ఆప్షన్లు, 29 పెయింట్ ఆప్షన్లను కలిగి ఉంది. ఈ-క్లాస్ ఎల్‌డబ్ల్యుబీ లాంచ్ ఈవెంట్ సందర్భంగా మెరెడెస్-బెంజ్ కంపెనీ ఈ విషయాన్ని వెల్లడించింది.

బుకింగ్ ఓపెన్ :
లాంచ్‌కు ముందే వెహికల్ 120కిపైగా బుకింగ్‌లను పొందినట్లు అధికారికంగా వెల్లడించింది. ఇప్పుడు కంపెనీ క్యూ3 2025 కోసం ముందుగానే బుకింగ్‌లను ప్రారంభించింది.

పవర్ ట్రైన్ :
హుడ్ కింద కొత్తగా లాంచ్ అయిన ఎఎంజీ జీ63 బై-టర్బో 4.0-లీటర్ వి8 ఇంజన్‌తో ఆధారితంగా పనిచేస్తుంది. 48వి మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌తో ఇంటిగ్రేట్ అయింది. ఈ పవర్‌హౌస్ ఆఫ్-రోడర్ గరిష్టంగా 577బీహెచ్‌పీ పవర్, 850ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

యూనిట్ 9-స్పీడ్ టార్క్ కన్వర్టర్ గేర్‌బాక్స్, ఎఎంజీ ఆకట్టుకునే పర్ఫార్మెన్స్ 4ఎంఏటీఐసీతో వస్తుంది. మోడల్ రేస్ స్టార్ట్ సిస్టమ్‌ను కూడా పొందుతుంది. ఎఎంజీ పర్ఫార్మెన్స్ ప్యాకేజీలో భాగమైంది. ఈ కారు కేవలం 4.3 సెకన్లలో 0 నుంచి 100kmp వరకు వెళ్లేలా చేస్తుంది. గరిష్టంగా గంటకు 240 కిలోమీటర్ల వేగాన్ని అందిస్తోంది.

లుక్స్, టాప్ ఎలిమెంట్స్ :
కంపెనీ ఎస్‌యూవీలో లాంచ్ కంట్రోల్ సిస్టమ్‌ను చేర్చింది. ఈ కేటగిరీలో అవుట్‌గోయింగ్ వెర్షన్ కలిగి ఉంది. అయితే, అప్‌డేట్ చేసిన ఫ్రంట్ ఫాసియాని భారీ సైజులో 3 సిల్వర్ యారోలతో మెరుగైన బ్లాక్-అవుట్ గ్రిల్‌ను కలిగి ఉంటుంది. ఆకట్టుకునే అల్లాయ్ వీల్స్ సెట్లు, భారీ క్లాడింగ్, రూఫ్ బెల్ట్స్, ఎల్ఈడీ ఉన్నాయి.

Read Also : OnePlus 13 Launch : వన్‌ప్లస్ 13 ఫోన్ లాంచ్ ఎప్పుడో తెలిసిందోచ్.. భారత్‌కు ఎప్పుడు రానుందంటే?