OnePlus 13 Launch : వన్‌ప్లస్ 13 ఫోన్ లాంచ్ ఎప్పుడో తెలిసిందోచ్.. భారత్‌కు ఎప్పుడు రానుందంటే?

OnePlus 13 Launch : భారత మార్కెట్లో కూడా వన్‌ప్లస్ 13 లాంచ్ కానుంది. వచ్చే జనవరి 2025లో వన్‌ప్లస్ 13 లాంచ్ అయ్యే అవకాశం ఉంది. వన్‌ప్లస్ 13 స్టైలిష్ డిజైన్‌ను కలిగి ఉంది.

OnePlus 13 Launch : వన్‌ప్లస్ 13 ఫోన్ లాంచ్ ఎప్పుడో తెలిసిందోచ్.. భారత్‌కు ఎప్పుడు రానుందంటే?

OnePlus 13 China launch confirmed

Updated On : October 22, 2024 / 10:29 PM IST

OnePlus 13 Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? వన్‌ప్లస్ నెక్స్ట్-లైన్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను అధికారికంగా ప్రకటించింది. రాబోయే వన్‌ప్లస్ 13 ఫోన్ అక్టోబర్ 31న చైనాలో లాంచ్ కానుంది. ఈ ఫోన్ డిజైన్, కలర్ వివరాలను కంపెనీ టీజ్ చేసింది. వన్‌ప్లస్ 13 మొత్తం 3 కలర్ ఆప్షన్లలో వస్తుంది. అందులో అబ్సిడియన్ బ్లాక్, డ్యూన్, బ్లూ మూమెంట్ ఉన్నాయి.

చైనా మార్కెట్‌లో లాంచ్ అయిన ఈ ఫోన్ త్వరలో గ్లోబల్ మార్కెట్‌లోకి కూడా రానుందని అంచనా. అదేవిధంగా, భారత మార్కెట్లో కూడా వన్‌ప్లస్ 13 లాంచ్ కానుంది. వచ్చే జనవరి 2025లో వన్‌ప్లస్ 13 లాంచ్ అయ్యే అవకాశం ఉంది. వన్‌ప్లస్ 13 స్టైలిష్ డిజైన్‌ను కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ మైక్రో-క్వాడ్-కర్వ్డ్ డిస్‌ప్లే, బ్యాక్ సైడ్ వృత్తాకార కెమెరా మాడ్యూల్ ఉండవచ్చు. కంపెనీ ప్రకారం.. గత మోడల్ మాదిరిగా కాకుండా, కెమెరా మాడ్యూల్ ఇకపై ఫోన్ ఫ్రేమ్‌తో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. అలాగే, మూడు లెన్స్‌లు, ఎల్ఈడీ ఫ్లాష్‌ను కూడా కలిగి ఉంటుంది.

భారత్‌లో వన్‌ప్లస్ 13 లాంచ్ (అంచనా) :
వన్‌ప్లస్ 13 ఫోన్ చైనాలో లాంచ్‌కు రెడీగా ఉంది. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ భారత మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇప్పటివరకు అధికారిక సమాచారం లేనప్పటికీ, జనవరి 2025లో వన్‌ప్లస్ 13 భారత్‌లోకి వస్తుందని ఊహాగానాలు ఉన్నాయి. వన్‌ప్లస్ 12 డిసెంబర్ 2023లో చైనాలో లాంచ్ అయింది. అదే ఫోన్ గత జనవరిలో భారత్‌లో లాంచ్ అయింది.

వన్‌ప్లస్ 13 లాంచ్‌కు కేవలం కొద్ది నెలలే సమయం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ కంపెనీలు సాధారణంగా ఫ్లాగ్‌షిప్‌లను వార్షికంగా మాత్రమే లాంచ్ చేస్తుంటాయి. కానీ, ఊహాగానాలు మాత్రమే. అసలు లాంచ్ వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

వన్‌ప్లస్ 13 భారత్ ధర (అంచనా) :
ఇటీవలి లీక్ ప్రకారం.. వన్‌ప్లస్ 16జీబీ ర్యామ్+512జీబీ స్టోరేజ్ మోడల్ వన్‌ప్లస్ 13 సీఎన్‌వై 5,299 ధరతో లాంచ్ కానుందని సూచిస్తుంది. అదే వేరియంట్ సీఎన్‌వై 4,799 వద్ద వన్‌ప్లస్ 12, వన్‌ప్లస్ 13 ఇండియా వేరియంట్‌కు సంబంధించి ఇంకా ఎలాంటి లీక్‌లు బయటకు రాలేదు. వన్‌ప్లస్ 12 లాంచ్ ధర అయిన రూ. 69,999తో పోల్చితే.. రాబోయే ఫోన్ ధర సుమారుగా రూ. 77వేలుగా ఉండవచ్చు.

Read Also : Jeep Meridian 2025 : టయోటా, ఎంజీ గ్లోస్టర్‌కు పోటీగా జీప్ మెరిడియన్ 2025 వచ్చేసిందోచ్.. ఫీచర్లు, ధర ఎంతంటే?