2020లో వచ్చిన 5 బెస్ట్ స్మార్ట్ ఫోన్లు.. నచ్చింది కొనేసుకోండి!

5 best use smartphones launched in 2020 : స్మార్ట్ ఫోన్ అనగానే.. అందరికి గుర్తొచ్చేది.. కెమెరా ఫీచర్లు.. స్పెషిఫికేషన్లు.. ఇవే యూజర్లను ఆకట్టుకునేవి.. అందుకే ఫీచర్లు బట్టి ధర ఎంతైనా కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఫొటోగ్రఫీకి ఎక్కువగా స్మార్ట్ ఫోన్ యూజర్లు ఇంట్రెస్ట్ చూపిస్తారు. కెమెరా సెటప్ గురించి ఆరా తీస్తుంటారు. ఆ తర్వాతే స్టోరేజీ ఇతర ఫీచర్ల గురించి ఆలోచిస్తారు. ప్రతిరోజు స్మార్ట్ ఫోన్ వాడేందుకు కొన్ని నిర్దిష్టమైన యాప్స్ మాత్రమే వాడుతుంటారు.
అందులో కెమెరా పాపులారిటీ గురించి చెప్పనక్కర్లేదు. రోజులో స్మార్ట్ ఫోన్లతోనే మీరు ఎక్కువ సమయం గడిపేస్తున్నారా? అయితే 2020లో బెస్ట్ కెమెరా ఫీచర్లతో లాంచ్ అయిన స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. 2020 మార్కెట్లోకి వచ్చిన బెస్ట్ స్మార్ట్ ఫోన్లలో మీకోసం 5 బెస్ట్ స్మార్ట్ ఫోన్లను అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన స్మార్ట్ ఫోన్ ఎంచుకుని కొనేసుకోండి.
1. Samsung Galaxy Note 20 Ultra :
సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ బెస్ట్ స్మార్ట్ ఫోన్ మోడల్ ఒకటి తీసుకొచ్చింది. అదే.. శాంసంగ్ గెలాక్సీ Note 20 Ultra. భారీ స్ర్కీన్ తో పాటు పవర్ ఫుల్ 12GB RAM, Exynos 990 చిప్ సెట్ అందిస్తోంది. ఇక బ్యాటరీ 4,500mAh అందిస్తోంది. ఒకసారి ఛార్జ్ చేస్తే రోజంతా వస్తుంది. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో ఇది బెస్ట్ అని చెప్పొచ్చు.
2. iPhone 12 :
ప్రముఖ ఐటీ దిగ్గజం ఆపిల్.. లేటెస్ట్ ఎడిషన్ ఫ్లాగ్ షిప్ మోడల్ తీసుకొచ్చింది. అదే.. iPhone 12. ఈ మోడల్ ఐఫోన్ వెనుక బాక్సీ డిజైన్, పవర్ ఫుల్ ప్రాసిసర్ అందించింది. ఫ్రెష్ కొత్త కలర్ యాడ్ చేసింది. స్ట్రాంగ్ బ్యాటరీ లైఫ్ తో రన్ అవుతుంది. 5G కూడా సపోర్ట్ చేస్తుంది.
3. OnePlus 8T 5G :
వన్ ప్లస్ 8T.. 5G సపోర్ట్ స్మార్ట్ ఫోన్.. 40 నిమిషాల్లో ఫుల్ ఛార్జింగ్ అయిపోతుంది. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో క్రేజీ స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. 5G సపోర్టుతో వచ్చిన ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ మోడల్ ఒకటి. వన్ ప్లస్ 8T 5G ఫోన్‌లో పవర్ ఫుల్ 120 Hz రీప్రెష్ రేట్, 4,500mAh బ్యాటరీ బ్యాకప్ తో భారీ స్పెషిఫికేషన్లతో వస్తోంది.
4. Samsung Galaxy S20 FE :
శాంసంగ్ నుంచి మరో ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ ఒకటి ఉంది.. అదే.. శాంసంగ్ గెలాక్సీ S20 FE. ఈ 2020 ఏడాదిలో హైయిస్ట్ రేటెడ్ ఆండ్రాయిడ్ ఫోన్. ఇందులో 120Hz డిస్‌ప్లే, పెద్ద 4,500mAh బ్యాటరీ, Exynos ప్రాసెసర్ కూడా ఉంది. IP68 వాటర్ రిసిస్టెన్స్, మూడు రియర్ కెమెరా సెటప్ అమర్చారు.
5. Google Pixel 4a :
ప్రస్తుతం.. ఫ్లిప్ కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్లో భాగంగా గూగుల్ కొత్త మోడల్ స్మార్ట్ ఫోన్ ఒకటి అందుబాటులో ఉంది. అదే.. Google Pixel 4a. ఈ మోడల్ ధర మార్కెట్లో రూ.31,999లుగా ఉంది. 6GB+128GB సెటప్, 5.81 అంగుళాల డిస్ ప్లేతో వచ్చింది. అరచేతిలో సరిగ్గా సెట్ అయ్యే ఫోన్ ఇది.. ఒక చేత్తోనే ఈజీగా ఆపరేట్ చేయొచ్చు. కానీ, ఇందులో చిన్న ఇబ్బంది ఏంటంటే? బ్యాటరీ సామర్థ్యం చాలా తక్కువ.. కేవలం 3140mAh బ్యాటరీతో వచ్చింది. కానీ, ఈ ఫోన్ ఒకసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే.. 9 గంటల పాటు వస్తుందని కంపెనీ చెబుతోంది.