5 UPI Payment Rules : 2024లో యూపీఐ పేమెంట్లు చేస్తున్నారా? 5 యూపీఐ పేమెంట్ రూల్స్ గురించి తప్పక తెలుసుకోండి!

5 UPI Payment Rules 2024 : యూపీఐ పేమెంట్లు చేస్తున్నారా? అయితే, 2024 కొత్త ఏడాదిలో జనవరిలో యూపీఐ పేమెంట్లలో అమలులోకి వచ్చే కొన్ని మార్పులు ఇలా ఉన్నాయి.

5 UPI Payment Rules 2024 : భారత్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన పేమెంట్ల మోడ్‌లలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ఒకటిగా మారింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) 2016లో ఈ యూపీఐ ప్లాట్ ఫారంను అభివృద్ధి చేసింది. భారతీయులు డబ్బు చెల్లించడం లేదా స్వీకరించే విధానాన్ని మార్చింది. గత కొన్ని నెలలుగా ఎన్‌పీసీఐ, యూపీఐ పేమెంట్లలో అనేక మార్పులను ప్రకటించింది. కొత్త ఏడాదిలో జనవరి (2024)లో అమలులోకి వచ్చే కొన్ని మార్పులు ఇలా ఉన్నాయి. అవేంటో ఓసారి వివరంగా తెలుసుకుందాం..

ఈ లావాదేవీలపై యూపీఐ లావాదేవీ పరిమితి పెంపు :
గత ఏడాది డిసెంబరులో, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ యూపీఐ పేమెంట్ల లావాదేవీల పరిమితిని గతంలో రూ. 1 లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంచినట్లు ప్రకటించారు. ఆసుపత్రులు, విద్యాసంస్థలకు చెల్లింపులు చేసేందుకు ఈ పెంపు వర్తిస్తుందని, ఆన్‌లైన్ చెల్లింపుల కోసం యూపీఐ పేమెంట్లను స్వీకరించనున్నట్టు గవర్నర్ ద్వైమాసిక ద్రవ్య విధాన కమిటీ (MPC) ప్రకటనలో తెలిపారు.

Read Also : ICICI Bank UPI Payments : ఐసీఐసీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్.. రూపే క్రెడిట్ కార్డ్‌లతో యూపీఐ పేమెంట్లు చేసుకోవచ్చు..!

ఇన్‌యాక్టివ్ యూపీఐ ఐడీలు డియాక్టివేట్ చేయండి :
గత ఏడాదిలో ఎన్‌పీసీఐ Google Pay, Paytm, PhonePe వంటి పేమెంట్ల యాప్‌లతో పాటు ఇతర బ్యాంకులతో పాటు డిసెంబర్ 31, 2023 నాటికి ఒక సంవత్సరానికి పైగా యాక్టివ్‌గా లేని ఇన్‌యాక్టివ్ యూపీఐ ఐడీలను డీయాక్టివేట్ చేయమని ఆదేశించింది. మీరు ఇన్‌యాక్టివ్‌గా ఉంటే అకౌంట్.. 2024లో ప్రవేశించినందున ఇన్‌యాక్టివ్ అయి ఉండవచ్చు. కస్టమర్‌లు తమ పాత నంబర్‌ను బ్యాంకింగ్ సిస్టమ్ నుంచి అన్‌లిక్ చేయకుండా మొబైల్ నంబర్‌ను మార్చుకుంటే.. పాత ఫోన్ లింక్ అయినవారికి అనుకోకుండా డబ్బు ట్రాన్స్‌ఫర్ చేయకుండా నిరోధించడానికి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని (NPCI) ఒక ప్రకటనలో తెలిపింది.

రూ. 1 లక్ష వరకు యూపీఐ ఆటో పేమెంట్లకు నో అథెంటికేషన్ :
కొన్ని సందర్భాల్లో రూ. 1 లక్ష వరకు యూపీఐ పేమెంట్లు చేసేందుకు ఇకపై అదనపు ఫ్యాక్టర్ అథెంటికేషన్ (AFA) అవసరం లేదని ఆర్బీఐ ఇటీవల ప్రకటించింది. ఎఎఫ్ఏ లేకుండా క్రెడిట్ కార్డ్ రీపేమెంట్స్, మ్యూచువల్ ఫండ్ సబ్‌స్క్రిప్షన్‌లు, ఇన్సూరెన్స్ ప్రీమియంల కోసం రికరింగ్ పేమెంట్‌లకు ఉపయోగించే ఇ-మాండేట్‌ల పరిమితిని పెంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి ముందు ఎఎఫ్ఎ లేకుండా ట్రాన్స్‌ఫర్ చేయగల డబ్బు పరిమితి రూ. 15వేలుగా ఉంటుంది.

యూపీఐ లైట్ వ్యాలెట్ లావాదేవీ పరిమితి పెంపు :
ఆఫ్‌లైన్‌లో చేసిన యూపీఐ లైట్ వాలెట్‌ల లావాదేవీ పరిమితి కూడా రూ. 200 నుంచి రూ. 500కి పెరిగింది. నగదు ట్రాన్స్‌ఫర్ చేయగల గరిష్ట మొత్తం రూ. 2వేలుగా ఉంటుంది. ఇంటర్నెట్ కనెక్షన్‌లు తక్కువగా ఉన్న ప్రదేశాలలో యూపీఐ-లైట్ వాలెట్ల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా అందుబాటులోకి తీసుకొచ్చింది.

నిర్దిష్ట యూపీఐ పేమెంట్లపై ఇంటర్‌చేంజ్ ఛార్జీలు :
నిర్దిష్ట వ్యాపారులు చేసే యూపీఐ ద్వారా చేసే పేమెంట్లపై 1.1శాతం ఇంటర్‌చేంజ్ రుసుమును విధిస్తున్నట్లు ఎన్‌పీసీఐ ప్రకటించింది. ఆన్‌లైన్ వాలెట్ల వంటి ప్రీపెయిడ్ పేమెంట్ల టూల్స్ ఉపయోగించి చేసిన రూ. 2వేల కన్నా ఎక్కువ రుసుము వర్తిస్తుంది.

5 UPI payment rules 

కొన్ని యూపీఐ పేమెంట్లపై 4 గంటల పరిమితి :
పెరుగుతున్న ఆన్‌లైన్ పేమెంట్ల మోసాలను అరికట్టడానికి, ఆర్బీఐ కొత్తగా యూపీఐ పేమెంట్లు అందుకునే యూజర్లకు రూ. 2వేల కన్నా ఎక్కువ మొదటి పేమెంట్లు చేసే వినియోగదారులకు 4 గంటల కాల పరిమితిని కూడా ప్రతిపాదించింది. యూజర్లు ఇంతకు ముందు లావాదేవీలు చేయని మరో వినియోగదారుకు రూ. 2వేల కన్నా ఎక్కువగా మొదటి పేమెంట్ చేసిన ప్రతిసారీ ఈ కొత్త పరిమితి వర్తిస్తుంది.

‘యూపీఐ ఫర్ సెకండరీ మార్కెట్’ :
ఎన్‌పీసీఐ బీటా వెర్షన్‌లో ‘యూపీఐ ఫర్ సెకండరీ మార్కెట్’ని ప్రారంభించినట్లు కూడా ప్రకటించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ‘యూపీఐ ఫర్ సెకండరీ మార్కెట్’ సౌకర్యంలో భాగంగా ఎన్‌పీసీఐ యూపీఐ పేమెంట్ల యాప్ ద్వారా లావాదేవీలను అందిస్తుంది.

యూపీఐ ఏటీఎం ‘ట్యాప్ అండ్ పే’ ఫంక్షనాలిటీ :
హిటాచీ పేమెంట్ సర్వీసెస్ (NPCI) సహకారంతో ‘దేశంలో మొట్టమొదటి యూపీఐ-ఏటీఎం’ని వైట్ లేబుల్ ఏటీఎం (డబ్ల్యూఎల్ఎ)గా ప్రవేశపెట్టింది. దీనిలో వినియోగదారులు మీ బ్యాంక్ అకౌంట్ నుంచి నగదును విత్‌డ్రా చేసుకోవడానికి క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయవచ్చు. ఎన్ఎఫ్‌సీ ఫీచర్ ఉన్న ఫోన్‌లతో యూపీఐ సభ్యులు త్వరలో యూపీఐ ‘ట్యాప్ అండ్ పే’ ఫంక్షనాలిటీతో అందుబాటులోకి రానుంది.

Read Also : Apple iPhone 16 Pro Launch : ఆపిల్ ఐఫోన్ 16 ప్రో సిరీస్ డిజైన్, స్పెషిఫికేషన్ల వివరాలు లీక్.. పూర్తి వివరాలు మీకోసం..!

ట్రెండింగ్ వార్తలు