6 Samsung Galaxy M-series phones start receiving Android 13 update_ New features, how to download
Samsung Galaxy M-series : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ M-సిరీస్ ఫోన్లలో కొత్త OS అప్‌డేట్ వచ్చేసింది. శాంసంగ్ (Samsung) ఎంపిక చేసిన శాంసంగ్ బడ్జెట్, మిడ్-బడ్జెట్ Galaxy M సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లపై Android 13-ఆధారిత One UI 5.0 అప్‌డేట్‌లను అందిస్తోంది. ఈ కొత్త Android 13 అప్‌డేట్ ప్రస్తుతం Galaxy M53, Galaxy, M52 5G, Galaxy M33, Galaxy M32 5G, Galaxy M32, Galaxy M13 5Gలో అందుబాటులోకి రానుంది.
శాంసంగ్ వినియోగదారులు Settings > Software Update వెళ్లడం ద్వారా కొత్త Update చెక్ చేయవచ్చు. ఆండ్రాయిడ్ అప్‌డేట్ సైజ్ ఫోన్ నుంచి ఫోన్‌కు మారవచ్చు. అయినప్పటికీ శాంసంగ్ వినియోగదారులు తమ డివైజ్‌లో తగినంత బ్యాటరీ ఉందని నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంది. One UI 5.0 ఆండ్రాయిడ్ 13 అప్‌డేట్ ఆధారంగా రూపొందించారు. ఫోటోలు, వీడియోలను యాడ్ చేయడం ద్వారా లాక్ స్క్రీన్‌ను ఎడిట్ చేయడానికి లేదా మెరుగుపరచడానికి వినియోగదారులను అనుమతిస్తుంది.
6 Samsung Galaxy M-series phones start receiving Android 13 update
హోమ్ స్క్రీన్‌లో స్పేస్ సేవ్ చేసేందుకు యూజర్లు అనేక విడ్జెట్‌లను ఒకే విడ్జెట్‌గా మెర్జ్ చేయవచ్చు. ఈ కొత్త OneUI 5.0 అప్‌డేట్ వాల్‌పేపర్ ఆధారంగా 16 ప్రీసెట్ కలర్ థీమ్‌లతో కూడా వస్తుంది. Samsung ఫొటో ఎడిట్ ఆప్షన్ విస్తరిస్తోంది. స్టిల్ ఇమేజ్‌ల నుంచి అవాంఛిత యూజర్లు, వస్తువులు, షాడోలు, రిప్లక్షన్స్ డిలీట్ చేసేందుకు మరింత మంది యూజర్లు మెరుగైన ఆబ్జెక్ట్ ఎరేజర్ టూల్ చూడవచ్చు.
ఇందులో ఫొటో రీమాస్టర్ టూల్ కూడా ఉంది. ఓల్డ్ ఫొటోలను షార్ప్ చేస్తుంది. రియల్ ఫొటో క్వాలిటీని అందిస్తుంది. పైన పేర్కొన్న కొన్ని ఫోటో ఎడిటింగ్ టూల్స్ ఫ్లాగ్‌షిప్ Galaxy S సిరీస్, Z ఫోల్డ్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లలో ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. అయితే శాంసంగ్ ఇప్పుడు వాటిని మరింత సరసమైన Galaxy M సిరీస్ ఫోన్‌లకు తీసుకువస్తోంది. Android 13-ఆధారిత One UI 5.0 స్ప్లిట్-స్క్రీన్ లేదా పాప్-అప్ వ్యూతో మల్టీ టాస్క్ చేసేందుకు యూజర్లకు అనుమతించనుంది.
6 Samsung Galaxy M-series phones start receiving Android 13 update_ New features, how to download
వినియోగదారులు సాధారణ స్వైప్ గెచర్ లేదా ఇటీవలి యాప్‌ల లిస్టు నుంచి సులభంగా మల్టీ-విండోలను ప్రారంభించవచ్చు. సెక్యూరిటీ కోసం, కొత్త సెక్యూరిటీ ప్రైవసీ డ్యాష్‌బోర్డ్ కెమెరా, మైక్రోఫోన్, లొకేషన్ సెట్టింగ్‌లకు యాక్సెస్ కలిగిన యాప్‌ల వంటి స్మార్ట్‌ఫోన్ వివిధ భద్రతా అంశాల స్టేటస్ త్వరితంగా వ్యూను అందిస్తుంది. శాంసంగ్ డ్యాష్‌బోర్డ్ స్మార్ట్‌ఫోన్ సెక్యూరిటీని మెరుగుపరచడానికి మార్గాలను కూడా సిఫార్సు చేస్తుంది. Samsung Galaxy M53, Galaxy M33, Galaxy M13 5G ఈ ఏడాదిలో భారత మార్కెట్లో ఆండ్రాయిడ్ 12-ఆధారిత One UI 4తో షిప్పింగ్ ఫోన్లతో వచ్చింది.
Galaxy M52 5G, Galaxy M32 5G, Galaxy M32 2021 ఇప్పటికే లాంచ్ అయ్యాయి. ఆండ్రాయిడ్ 11తో ఈ ఏడాదిలో లాంచ్ అయిన ఫోన్‌లు ఆండ్రాయిడ్ 12ని గెలాక్సీ F సిరీస్ ఫోన్‌ల భారతీయ యూజర్లు త్వరలో ఆండ్రాయిడ్ 13 ఆధారిత One UI 5 అప్‌డేట్‌ను స్వీకరిస్తారని శాంసంగ్ తెలిపింది. ముందుగా పొందడానికి కంపెనీ మోడల్‌లను వెల్లడించలేదు. భారత మార్కెట్లో F-సిరీస్ Galaxy F13, Galaxy F23, Galaxy F42 5G వంటి బడ్జెట్ ఆప్షన్లతో అందిస్తుంది.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..