భారీ బ్యాటరీతో శాంసంగ్ నుంచి కొత్త బడ్జెట్ ఫోన్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?

సౌత్ కొరియా స్మార్ట్ ఫోన్ దిగ్గజం శాంసంగ్ నుంచి కొత్త బడ్జెట్ ఫోన్ వచ్చేసింది.. భారత మార్కెట్లోకి జూలై 30న కొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయింది. శాంసంగ్ గెలాక్సీ M31S మోడల్ రెండు వేరియంట్లలో మార్కెట్లోకి కంపెనీ లాంచ్ చేసింది.
వచ్చే ఆగస్ట్ 6వతేది నుంచి అమెజాన్, samsung.com వెబ్ సైట్లో దేశవ్యాప్తంగా లభ్యం కానుంది. ఈ ఫోన్ రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉండనుంది. గెలాక్సీ M31S మోడల్ ఫోన్లలో మిరాజ్ బ్లూ, మిరాజ్ బ్లాక్ రెండు కలర్ ఆప్షన్లలో వస్తోంది.
బయోమెట్రిక్ ఫెసిలిటీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. డ్యూయల్ సిమ్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆండ్రాయిడ్ 10 ఆధారిత వన్ UI 2.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఈ ఫోన్‌లో రివర్స్ ఛార్జింగ్ సదుపాయం అందిస్తోంది.
వేరే మొబైల్‌ను రివర్స్ ఛార్జింగ్ చేయొచ్చు. సింగిల్ టేక్ కెమెరా మోడ్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా చెప్పవచ్చు. ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చు. సింగిల్ టేక్ ఫీచర్ శాంసంగ్ ప్రీమియం గెలాక్సీ ఫోన్లలో ఈ ఫోన్ ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది.
గెలాక్సీ.. M31S ఫీచర్లు ఇవే :
* 6.5 అంగుళాల AMOLED 407 PPI పంచ్ హోల్ డిప్లే
* ఇన్ఫినిటీ-0 డిస్ ప్లే Exynos 9611 ప్రాసెసర్
* 6GB + 8GB RAM
* 128GB + 256GB స్టోరేజీ
* రియర్ కెమెరా సెటప్ 64MP (F/1.8)+12(F/2.2)UW+5MP (F/2.4)
* డెప్త్+5 (F/2.4) మాక్రో – ఫ్రంట్ 32MP (F/2.2) కెమెరా
* 6000mAh బ్యాటరీ, 25W టైప్-C ఛార్జింగ్
* ఫ్రంట్ 32MP సెల్ఫీ కెమెరా
* బ్యాక్ సైడ్ 3 ప్రైమరీ కెమెరాలు
శాంసంగ్ గెలాక్సీ M31S ధర ఎంతంటే? :
* ప్రారంభ ధర 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,499
* 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21,499